దీపిక- కల్కి.. ఇప్పుడిదే పెద్ద హాట్ టాపిక్!

కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఎక్కడ చూసినా దాని కోసమే చర్చ నడుస్తోంది.

Update: 2024-06-13 07:05 GMT

కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఎక్కడ చూసినా దాని కోసమే చర్చ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్ సినిమా అని హీరో ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ పక్కా అని చెబుతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్ తో పాటు హార్డ్ వర్క్ అంటే ఏంటో ట్రైలర్ చూస్తే తెలుస్తోందని అంటున్నారు. నాగి విజన్ వేరే లెవల్ అంటూ నెట్టింట తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. దీపికా పదుకొణె తెలుగు డబ్బింగ్ బాగోలేదని విమర్శలు వచ్చాయి. కానీ కొందరు కావాలనే నాగ్ అశ్విన్ భవిష్యత్తులో లాంగ్వేజ్ ఎవల్యూషన్ దృష్టిలో పెట్టుకుని అలా చేసి ఉంటారని తెలిపారు. ఇప్పుడు దీపిక పాత్ర కోసం జోరుగా చర్చ సాగుతోంది. మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ ఆమెదే. కానీ ఎలాంటి రోల్ లో కనిపిస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ట్రైలరే.

మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత.. ప్రభాస్ కల్కి కాదని, ఆయన భైరవ మాత్రమేనని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సినిమాలో దీపిక గర్భంలో ఉన్న బాలుడే కల్కి అని తెలిపారు. అంతే కాదు అశ్వత్థామ పాత్రలో ఉన్న అమితాబ్ దీపికను 'నీ గర్భంలో ఉన్న పిండాన్ని నేను రక్షిస్తానమ్మా' అని చెబుతారు. దానిని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ.. దీపిక కల్కికి జన్మనిస్తుందని, ఆ తర్వాత అతడి బాధ్యతలను భైరవ తీసుకుంటాడని అంటున్నారు.

ఇప్పుడు ఓ థియరీ ప్రకారం.. దీపిక కల్కి తల్లి సుమతి పాత్ర పోషిస్తోందని చెబుతున్నారు. అందుకే SUM-80 అని బౌంటీకి పేరు పెట్టారని అంటున్నారు. అంతే కాదు.. ప్రభాస్ భైరవతో పాటు కల్కిగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని చెబుతున్నారు. దీంతో మరి మేకర్స్.. ఎందుకు పోస్టర్ లో దీపిక రోల్ పద్మ అని వేశారని కొందరు డౌట్ పడుతున్నారు. ట్రైలర్ ప్రకారం ఒకలా అర్థమవుతోందని.. అంతా మిస్ లీడ్ అవుతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.

మరో థియరీ ప్రకారం.. కల్కికి భైరవుడు మెంటార్ లాంటి వారని, శివ వైష్ణవ అవతారమే బైరవుడని అంటున్నారు. మొత్తానికి పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కు సైన్స్ జోడించి ఈ సినిమా రూపొందించడంతో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాపై హైప్ క్రియేట్ అవుతున్నా.. పాత్రలు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన కల్కి జూన్ 27న విడుదల అయ్యాక మొత్తం క్లియర్ అవ్వనుంది.

Tags:    

Similar News