టాప్ హీరోయిన్‌తో స్టార్ హీరో బ్రేకప్.. ఇదీ అసలు నిజం!
వీరిద్దరూ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారని కూడా అంతర్గత సోర్స్ ధృవీకరించింది. ఈ జంట మధ్య సరిగా లేదనే దాంట్లో ఎలాంటి నిజం లేదని హిందూస్తాన్ టైమ్స్ కథనం వెల్లడించింది.
రణవీర్ సింగ్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ కోసం తపిస్తున్నాడు. దానికోసం తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మను ఇప్పటికే కలిసాడు. 'హనుమాన్' సీక్వెల్ తో పాటు మరో ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాడని కథనాలొచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇంతలోనే రణవీర్ ఇతర కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి దీపికా పదుకొణెతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అకస్మాత్తుగా తొలగించాడు. దీంతో అభిమానులు పెద్ద షాక్‌లో ఉన్నారు. రణవీర్ పెళ్లి ఫోటోలను తొలగించగానే.. దీపికతో అతడి వివాహబంధం చిక్కుల్లో పడిందనే పుకార్లు మొదలయ్యాయి. రణవీర్ తన సోషల్ మీడియా ఖాతా నుండి ఫోటోలను శాశ్వతంగా తొలగించాడా లేదా వాటిని ఆర్కైవ్ చేసాడా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రణవీర్ మాత్రమే కాదు, దీపిక కూడా మూడేళ్ల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వారి వివాహ ఫోటోలను తొలగించింది. 1 జనవరి 2021న దీపిక తన పోస్ట్‌లన్నింటినీ దాచిపెట్టి, ఇన్‌స్టాగ్రామ్‌ని కొత్తగా ప్రారంభించాలని భావించింది. ఆ సమయంలో దీపిక అభిమానులతో 'ఆడియో డైరీ'ని షేర్ చేసారు. కోవిడ్ సమయంలో కష్ట కాలం గురించి ఆ ఆడియో డైరీలో దీపిక ప్రస్థావించింది. ఆ తర్వాత దీపిక దాదాపు 11 నెలల తర్వాత రణవీర్‌తో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తొలగించింది. వారి వివాహ వార్షికోత్సవాల సమయంలో షేర్ చేసిన పోస్ట్‌లను కూడా అన్‌ఆర్కైవ్ చేయలేదు.
ఇప్పుడు రణవీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను ఇన్ స్టా నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట మధ్య అంతా సవ్యంగా లేదని పుకార్లు షికార్ చేసాయి. అయితే రణవీర్ -దీపిక కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక సోర్స్ ప్రకారం.. ''ఈ జంట నడుమ ఎలాంటి కలతలు లేవు. ఆ ఇద్దరూ కలిసి ఉన్నారు. బంధం బలంగా ఉంది. వారి మొదటి బిడ్డను కలిసి స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు'' అని తెలిసింది. వీరిద్దరూ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారని కూడా అంతర్గత సోర్స్ ధృవీకరించింది. ఈ జంట మధ్య సరిగా లేదనే దాంట్లో ఎలాంటి నిజం లేదని హిందూస్తాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. కేవలం పెళ్లి ఫోటోలే కాదు.. 2022-2023కి ముందు కాలానివి చాలా ఫోటోలను రణవీర్ తొలగించాడు. కేవలం పెళ్లి ఫోటోల గురించే ఆలోచించకండి. వారి మధ్య ఏదో జరిగిందని అనవసరంగా ఊహించకండి! అని ఒక సోర్స్ వ్యాఖ్యానించినట్టు తెలిపింది.
హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ''ఈ పుకార్లు నిరాధారమైనవి. వారు కలిసి సంతోషంగా ఉన్నారు. బిజీ షెడ్యూల్‌ల నుండి బయటపడటానికి నిరంతరం వారు ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారీ కొంత నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. వారు తమ మొదటి బిడ్డను ప్రపంచానికి స్వాగతించడానికి నిజంగా సంతోషంగా వేచి చూస్తున్నారు. వారి జీవితంలోని ఈ దశలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాధిస్తున్నారు. నిజానికి దీపికా- రణ్‌వీర్ భారతదేశం విడిచిపెట్టి విదేశాలలో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు'' అని పేర్కొంది.