'దేవర' ఆ 15 నిమిషాలు అరాచకం

ఎన్టీఆర్ 'దేవర' సినిమా నందమూరి అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Update: 2024-09-25 09:38 GMT

ఎన్టీఆర్ 'దేవర' సినిమా నందమూరి అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందరు హీరోల అభిమానులూ దేవర సినిమా ఎప్పుడు వస్తుందో, చూడాలి అనే ఆసక్తితో ఉన్నారు. దేవర సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కొరటాల శివ గత చిత్రం ఫలితం, ఎన్టీఆర్‌, కొరటాల కాంబోలో వచ్చిన గత చిత్రం ఫలితం కారణంగా దేవర గురించి పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్నా కొద్ది అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉన్నాయి. దేవర సినిమాను ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

కొరటాల శివ కాంబోలో రూపొందిన దేవర రెండు పార్ట్‌ లుగా రాబోతుంది. మొదటి పార్ట్‌ క్లైమాక్స్ సన్నివేశాలు ఓ రేంజ్‌ లో ఉంటాయట. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ అరాచకం అంటూ కేకలు వేసే విధంగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగానే దేవర వంటి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. కానీ అంతకు మించి అంటూ దేవర సినిమా మొదటి రోజు దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు బాక్సాఫీస్‌ వర్గాల వారు సైతం చాలా నమ్మకంగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ కి జోడీగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించింది. బాలీవుడ్‌ లో ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంది. ఇక బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సైఫ్‌ అలీ ఖాన్ తో ఎన్టీఆర్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. చివరి 15 నిమిషాల్లో ఎన్టీఆర్‌, సైఫ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని సీటు అంచున కూర్చోబెడుతాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా వసూళ్లతో పోల్చితే రెట్టింపుకు మించి దేవర కలెక్షన్స్‌ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. కనుక ముంబై తో పాటు పలు ఏరియాల్లో దేవర సినిమా కి సంబంధించి విపరీతమైన పబ్లిసిటీ చేయడం జరుగుతోంది. అదే స్థాయిలో సినిమా కి అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతోంది. యూఎస్ లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా నమోదు అయ్యాయి. లాంగ్‌ రన్‌ లో దేవర 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News