దేవర ఫుట్ ఫాల్స్.. ఆ రికార్డ్ అందుకుంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి మొదటి రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ఒక పోస్టర్ అయితే వదిలారు

Update: 2024-09-30 04:40 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి మొదటి రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ఒక పోస్టర్ అయితే వదిలారు. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన చిత్రాలలో కల్కి అనంతరం ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న రెండో సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా 2024లో టాప్ 1, 2 స్థానాలలో ఉన్న సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ అయినవే కావడం విశేషం. ‘దేవర’ సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చిన కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉంది. సోమవారం నుంచి ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దానిపై సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది వీక్షించిన (ఫుట్ ఫాల్స్) సినిమాల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో ఉంది. ఈ సినిమాని లాంగ్ రన్ లో ఏకంగా కోటి 90 లక్షల మంది వీక్షించారు. నిజానికి కరోనా తర్వాత థియేటర్స్ లో సినిమాలు చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. ఓటీటీలకి ఆదరణ పెరిగింది. అయితే సినిమాలు సూపర్ హిట్ అయితే మాత్రం ప్రేక్షకాదరణ బాగుంటుంది. కరోనా తర్వాత పెద్ద హీరోల సినిమాలలో ‘అఖండ’ ముందుగా రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రాన్ని ఏకంగా 95 లక్షల మంది వీక్షించారు. కరోనాకి ముందుతో పోల్చుకుంటే ప్రేక్షకాదరణ బాగా తగ్గింది. అయిన కూడా కరోనా భయాన్ని వదిలేసి అఖండ సినిమాని చూడటానికి 95 లక్షలు మంది థియేటర్స్ కి వచ్చారంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాని కూడా కోటి 30 లక్షల మంది థియేటర్స్ లో వీక్షించారు. ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి2898ఏడీ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో కోటి 25 లక్షల మంది వీక్షించారు.

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ‘కల్కి’ మూవీకి అత్యధిక ప్రజాధారణ లభించింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాన్ని ఎంత మంది వీక్షిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘దేవర’ మూవీని థియేటర్స్ లో చూసే ఆడియన్స్ సంఖ్య కోటి దాటుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మూవీకి మిశ్రమ స్పందన వస్తోన్న నేపథ్యంలో కోటి మంది వీక్షించే అవకాశం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమా స్లోగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని కచ్చితంగా థియేటర్ ఆడియన్స్ నెంబర్ కోటి దాటుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి వీరిలో ఎవరి ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

థియేటర్స్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

ఆర్.ఆర్.ఆర్ - 190 లక్షలు

పుష్ప - 130 లక్షలు

కల్కి - 125 లక్షలు

సలార్ - 115 లక్షలు

వాల్తేరు వీరయ్య - 105 లక్షలు

భీమ్లా నాయక్ - 100 లక్షలు

కేజీఎఫ్ 2 - 100 లక్షలు

హనుమాన్ - 100 లక్షలు

అఖండ - 95 లక్షలు

సర్కారు వారి పాట - 85 లక్షలు

అదిపురుష్ - 75 లక్షలు

గుంటూరు కారం - 75 లక్షలు

Tags:    

Similar News