దేవర ఫ్యాన్స్‌కి ఝడిసి అనుమతి నిరాకరణ
ఇదిలా ఉంటే, రిలీజ్ ముందు బజ్ కోసం భారీగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించాలని ఔట్ డోర్ గ్రౌండ్స్ కోసం వెతుకుతున్న చిత్ర బృందానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ `దేవర` ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించారు. ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా మిశ్రమ స్పందన వచ్చింది.
కానీ ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా అడ్వాన్స్ సేల్స్ బలంగా ఉన్నాయని ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్నాటకలోను ఈ సినిమా భారీగా విడుదలవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లోను రిలీజ్ కి సర్వసన్నాహకాలు చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో డి-బాక్స్ టెక్నాలజీలో ప్రత్యేకంగా విడుదలవుతున్న మొదటి భారతీయ చిత్రంగా దేవర నిలవనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, రిలీజ్ ముందు బజ్ కోసం భారీగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించాలని ఔట్ డోర్ గ్రౌండ్స్ కోసం వెతుకుతున్న చిత్ర బృందానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ లో ఔట్ డోర్ వేదికకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడం ఖాయం గనుక, ఆ తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల భారీ ఈవెంట్ కి అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక అప్ డేట్ ని చిత్రబృందం ఇవ్వాల్సి ఉంది.