దేవర మరో సర్ ప్రైజ్.. ఇది రత్నవేలు సమాధానం

'దేవర' మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా చాలా ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకుంటున్నారు.

Update: 2024-09-24 09:11 GMT

‘దేవర’ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ జోరుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా ‘దేవర’ ప్రమోషన్స్ ని గట్టిగా చేస్తున్నారు. ‘దేవర’ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా చాలా ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా కాకుండా మరో పాత్రలో కూడా నటించాడనే ప్రచారం చాలా రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కచ్చితంగా అందరిని ఆశ్చర్యపరుస్తాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ వార్తలు నిజమనే నమ్మేస్తున్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ లో అయితే ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటిస్తున్నాడని రివీల్ అయ్యింది. ఇంకో క్యారెక్టర్ ని సర్ప్రైజ్ గా ఉంచారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన రత్నవేలు ఇంటరెస్టింగ్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ‘దేవర’ మూవీ గురించి ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు ప్రసారం చేస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మూవీ గురించి యుట్యూబర్స్ ఏం చెబుతున్నారో చూస్తున్నాను. ఈ సినిమా గురించి ప్రేక్షకులు నా నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో తెలుసు.

మూవీలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా మాత్రమే నటిస్తున్నారని మాత్రమే కాకుండా ఇంకేదో అడగాలని అనుకుంటున్నారు. అయితే అవన్నీ కూడా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చి చూస్తే తెలుస్తాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో చాలా బలమైన క్యారెక్టర్స్ చేశారని రత్నవేలు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

రత్నవేలు పోస్ట్ బట్టి చూస్తుంటే ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రలు మాత్రమే కాకుండా మూడో క్యారెక్టర్ లో కూడా కనిపిస్తున్నట్లు అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంత వరకు వాస్తవం అవుతుందనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే. ఏది ఏమైనా ‘దేవర’ సినిమాపైన రోజురోజుకి పబ్లిక్ కి క్యూరియాసిటీ పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News