దేవర సక్సెస్ వేడుక.. అడ్డా ఎక్కడ..?

ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ దేవర సినిమా అంచనాలకు తగినట్టు లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం సినిమా చూసి ఖుషి అవుతున్నారు

Update: 2024-09-28 12:21 GMT

ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ దేవర సినిమా అంచనాలకు తగినట్టు లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం సినిమా చూసి ఖుషి అవుతున్నారు. కొరటాల శివ ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సినిమా వేరేలా ఉండేదని అంటున్నారు. దేవర సినిమా ప్రీమియర్స్ టాక్ తేడా కొట్టినా రెగ్యులర్ షోతో మంచి ఊపందుకుంది. ఫైనల్ గా ఈ సినిమా ఫ్యాన్స్ కి బాగానే ఎక్కేసింది. రాజమౌళి సినిమా తర్వాత హీరోకి ఫ్లాప్ పడుతుంది అన్న బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్టే అని చెప్పొచ్చు. అంతేకాదు దేవర కు ఉన్న బజ్ దృష్ట్యా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది.

మొదటి రోజే 175 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ స్టామినా ఏంటో చూపించాడు ఎన్ టీ ఆర్. ఐతే దేవర రిలీజ్ ముందు ఫ్యాన్స్ ను కలిసి సినిమా గురించి ఎంతో చెప్పాలని ప్రయత్నించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. ఈవెంట్ లేకుండానే సినిమా రిలీజ్ అవ్వడం ముందు టాక్ బాగా లేకపోయినా ఈవెనింగ్ కల్లా సెట్ రైట్ అవ్వడం ఇదంతా ఎన్ టీ ఆర్ సత్తా చాటేలా చేస్తుంది.

ఐతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగు జరగలేదు కాబట్టి దేవర సక్సెస్ ఈవెంట్ మాత్రం గట్టిగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. దేవర సినిమా సక్సెస్ పార్టీ ఎక్కడ జరపాలి అని చర్చ మొదలైంది. నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్లాన్ చేయగా ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల ఈవెంటే రద్దు చేశారు. ఐతే ఈసారి ఓపెన్ గ్రౌండ్ లో దేవర సక్సెస్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. అది తెలంగాణాలో చేస్తారా లేదా ఏపీలో ఫిక్స్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఎక్కడ చేసినా ఈసారి మాత్రం ఫ్యాన్స్ అందరు వచ్చేలా అడ్డా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. దేవర సక్సెస్ కచ్చితంగా ఫ్యాన్స్ తో జరుపుకోవాలని యూనిట్ నిర్ణయించింది. అందుకే వారం పది రోజుల్లో దేవర సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర కోసం ఎన్టీఆర్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఫ్యాన్స్ తో రిలీజ్ ముందు చెప్పాలనుకున్న విషయాలు రిలీజ్ తర్వాత షేర్ చేసుకుంటాడా.. స్టేజ్ మీద ఫ్యాన్స్ ని ఉద్దేశించి తారక్ ఏం మాట్లాడతాడు అన్నది చూడాలని అందరు ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

Tags:    

Similar News