పిక్‌టాక్‌ : దేవర, తంగం రొమాన్స్ వైరల్‌

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా రూపొందిన దేవర సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

Update: 2024-09-04 07:04 GMT

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా రూపొందిన దేవర సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన మేకర్స్ మూడో పాటకు రెడీ అయ్యారు. రెండో పాట చుట్టమల్లె కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని జాన్వీ కపూర్‌ అందానికి అంతా ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ కాంబోకి మంచి రెస్పాన్స్‌ దక్కింది.


దేవర మూడో పాట కూడా ఎన్టీఆర్‌, జాన్వీ రొమాంటిక్ బిట్ గా రాబోతుంది. దావుది.. అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన స్టిల్స్ ఇంకా ప్రోమో వీడియోను విడుదల చేశారు. సెకండ్‌ పాటకు ఏమాత్రం తగ్గకుండా మూడో పాట ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ను ప్రోమో ను చూస్తే అర్థం అవుతుంది. నేడు సాయంత్రం విడుదల అవ్వబోతుంది. పాట విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన ఈ స్టిల్ కి మంచి స్పందన దక్కింది. ఎన్టీఆర్‌ ను దేవరగా, జాన్వీ కపూర్‌ ను తంగం పాత్రలో చూడబోతున్న విషయం తెల్సిందే. దేవర, తంగం ల ఈ రొమాంటిక్ ఫోజ్‌ సినిమా పై ఆసక్తి పెంచే విధంగా ఉంది.

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ కాంబో మూవీ కోసం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ దేవర రూపంలో రాబోతుంది. దేవర రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతుంది. మొదటి పార్ట్‌ లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ ల మధ్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు, లవ్‌ సాంగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. ఆ ప్రచారం నిజమే అన్నట్లుగా ఇటీవల విడుదల అయిన చుట్టమల్లే పాట నిలిచింది. ఇప్పుడు మూడో పాట కూడా ఆకట్టుకోబోతుంది.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా జాన్వీ కపూర్ కి సాలిడ్ సక్సెస్ ఇప్పటి వరకు పడలేదు. దాంతో ఈ సినిమా పై ఆమె చాలా ఆశలు పెట్టుకుని వెయిట్‌ చేస్తోంది. నటిగా ముందు ముందు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తో చేసిన రొమాన్స్ హిట్ అవ్వాలి. ఇలాంటి ఫోజ్ లు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ భలే జోడీ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ దేవర సినిమా తర్వాత చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News