దేవరకి పోటీగా ఆ ఇద్దరు బరిలోకి
దీంతో దేవర- బడేడియా చోటే మియా మధ్య కేవలం నాలుగు రోజుల గ్యాప్ కనిపిస్తుంది. ఇది హిందీ మార్కెట్ లో దేవరపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య 'దేవర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత తారక్ నుంచి రిలీజ్ అవుతోన్న తొలి సోలో పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్అ యిన ప్రచార చిత్రాల అన్ని భాషల్లోనూ సంచలనమవుతున్నాయి. తారక్ లుక్..కంటెంట్ అందులో పాత్రలు ఎలా ఉంటాయి అన్నది కొరటాల ముందుగానే రివీల్ చేసేసారు.
దీంతో ఆ పాత్రలు ఎంతటి రా అండ్ రస్టిక్ గా మలిచి ఉంటార న్నది గెస్ చేయోచ్చు. కొరటాల మాస్ మార్క్ ని మించి ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే సినిమాతో సరికొత్త కొరాటాలని చూస్తామని తెలుస్తుంది. అటు 'వార్ -2'తో యంగ్ టైగర్ బాలీవుడ్ లోనూ లాంచ్ అవ్వడం అన్నది 'దేవర'కి కలిసొచ్చిన అంశం గా కలిసొస్తుంది. ఇలాంటి అంచనాల మధ్య హిందీలోనూ సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్ప టికే పాన్ ఇండియాలో ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా అదే తేదికి రిలీజ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే సినిమా షూటింత్ కూడా 85 శాతం పూర్తయింది. దీంతో ప్రకటించిన తేదీకి దేవర దిగపోవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు దేవరకి పోటీగా దిగుతున్నారు. ఆ ఇద్దరు యంగ్ టైగర్ మీదకి కలిసి రావడం విశేషం. ఇంతకీ ఎవరా హీరోలు? ఏంటా సినిమా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఖిలాడీ అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ కలిసి 'బడేమియా చోటే మియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇదే సినిమా ఏప్రిల్ 9 లేదా 10 తేదీల్లో రిలీజ్ కానుందని సమాచారం. దీంతో దేవర- బడేడియా చోటే మియా మధ్య కేవలం నాలుగు రోజుల గ్యాప్ కనిపిస్తుంది. ఇది హిందీ మార్కెట్ లో దేవరపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సలార్-డంకీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సన్నివేశం కనిపించిందో తెలిసిందే. నార్త్ లో 'సలార్' వసూళ్లు వీక్ గా ఉండటానికి కారణం డంకీ రిలీజ్. ఇప్పుడదే పరిస్థితి అక్షయ్ సినిమా గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే కనిపిస్తుందని తెలుస్తుంది.