ఖుషీ విషయంలో అంత ఆలస్యం ఎందుకు..?

అయితే, ఈ విషయంలో ఖుషీ మూవీ మాత్రం వెనకపడి ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాలేదు

Update: 2023-08-29 11:37 GMT

అందరికీ నచ్చేలా సినిమా తీయడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యం. అందుకే, అందరు మూవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి క్యూరియాసిటీ పెంచుతారు. ఫస్ట్ పోస్టర్, మొదటి సింగిల్, టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కో రూపంలో ఆ సినిమాని స్లో పాయిజన్ లాగా ప్రేక్షకుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సినిమాలకు పాటలు, ట్రైలర్ లతో మంచి బజ్ వచ్చేస్తూ ఉంటుంది.

అలా బజ్ వచ్చి, అందరూ ఆసక్తి చూపిస్తున్న సినిమాల్లో ఖుషీ కూడా ఒకటి. మంచి బజ్ ఉంది. అయితే, కాస్తో కూస్తో మూవీకి బజ్ ఉన్న మూవీలకు కలెక్షన్లు ఎక్కువ రాబట్టడానికి దర్శక నిర్మాతలు అడ్వాన్స్ బుకింగ్ సిస్టమ్ పెడుతూ ఉంటారు. చాలా మందికి తమ అభిమాన హీరోల సినిమాలను మొదటి రోజు మొదటి షో చూడాలనే కోరిక ఉంటుంది. దాని కోసమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు.

అయితే, ఈ విషయంలో ఖుషీ మూవీ మాత్రం వెనకపడి ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ఆగస్టు 30వ తేదీ ఉదయం పది గంటలకు ఓపెన్ చేస్తారు. ఈ రోజుల్లో అన్ని సినిమాలకు మూడు, నాలుగు రోజుల ముందే మొదలుపెడుంటే, ఈ మూవీ మేకర్స్ ఇంత ఆలస్యంగా ఓపెన్ చేస్తామని ప్రకటించడం విశేషం.

అడ్వాన్స్ బుకింగ్ పెట్టలేదు అంటే, థియేటర్స్ ఇంకా కన్ఫామ్ కాలేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు, మైత్రి మూవీ మేకర్సే దీన్ని స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో నైజామ్ ప్రాంతంలో ఉన్న ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు కూడా సెట్ అవ్వలేదట. అందుకే థియేటర్స్ ని కన్ఫామ్ కాలేదని, అందుకే ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.

ఇక, ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత వారం గ్యాప్ తో షారూక్ జవాన్, అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప, ఖుషీ కి తిరుగులేదనే చెప్పాలి. ఇక, ఈ మూవీ కంప్లీట్ లవ్ స్టోరీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్. ఈ మూవీ హిట్ ప్రస్తుతం సమంతో పాటు, విజయ్ కెరీర్ కి కూడా చాలా అవసరం. మరి ఈ ఖుషీ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News