'రాబిన్‌ హుడ్‌'లో భజరంగ్ లుక్‌ చూశారా..?

తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటించిన దేవదత్త జి నాగ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు.

Update: 2025-02-05 09:12 GMT

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్‌ హుడ్‌' సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపుగా పూర్తి కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్‌ హడావుడి మొదలు పెట్టబోతున్నారు. ఆ మధ్య సినిమా విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో ప్రమోషన్ హడావుడి చేశారు. కానీ సినిమా వాయిదా పడటంతో అంతా సైలెంట్‌ అయ్యారు. త్వరలోనే తిరిగి సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టబోతున్నారు.


తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటించిన దేవదత్త జి నాగ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ఈయన ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్‌' సినిమాలో భజరంగ్ పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ మధ్య తెలుగులో దేవకీ నందన వాసుదేవ సినిమాలోనూ దేవదత్త కనిపించారు. ఆ సినిమాలో నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్నారు. ఇప్పుడు రాబిన్‌ హుడ్‌లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సామి అనే పవర్‌ ఫుల్‌ విలన్‌ రోల్‌లో దేవదత్తను చూపించబోతున్నట్లు మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేశారు. సాధారణంగా సినిమాలోని విలన్‌కి పోస్టర్స్‌ వేయరు. కానీ ఈ పాత్రకు పోస్టర్ వదిలారు అంటే సినిమాలో ఎంతో కీలకం అయ్యి ఉంటుంది.

భజరంగ్‌ పాత్రతో ఆకట్టుకున్న దేవదత్త తెలుగులో మరిన్ని సినిమాల్లో ముందు ముందు నటించే విధంగా రాబిన్ హుడ్‌లోని సామి పాత్ర ఉంటుందని తాజా పోస్టర్‌ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు. కనుక రాబిన్ హుడ్‌ సినిమా హిట్ తర్వాత దేవదత్త టాలీవుడ్‌లో బిజీ కావడం కన్ఫర్మ్‌. గతంలో ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, విలన్స్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో మరో మంచి విలన్‌ టాలీవుడ్‌కి దక్కడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దేవదత్త బర్త్‌ డే సందర్భంగా రాబిన్‌ హుడ్‌లోని ఆయన పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన దక్కింది. నితిన్‌, శ్రీలీల కాంబో కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 వంటి భారీ విజయం సొంతం చేసుకున్న తర్వాత తీసుకు రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. నితిన్‌, వెంకీ కుడుముల కాంబోలో గతంలో వచ్చిన మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమాకి పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది.

Tags:    

Similar News