దేవియాని శర్మ.. మరోసారి గ్లామర్ బ్లాస్ట్

దేవియాని శర్మ.. రెండు వెబ్ సిరీసులతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

Update: 2024-07-20 11:28 GMT

దేవియాని శర్మ.. రెండు వెబ్ సిరీసులతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ నవీన్‌ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది అమ్మడు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది. అనంతరం పలు చిత్రాల్లో కూడా నటించింది.


సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసుల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది దేవియాని శర్మ. సేవ్ ది టైగర్స్ సిరీస్ లో హై ప్రొఫైల్ ఫెమినిస్ట్ లాయర్ గా నటించిన నార్త్ బ్యూటీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ జయప్రద రోల్ లో నటించి అదరగొట్టింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఒక్కసారిగా టాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.


అయితే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవియాని శర్మ.. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని స్టేజ్ డ్రామాల్లో నటించింది. బాలీవుడ్ లో లవ్ శుద సినిమాలో చిన్న రోల్ చేసిన బ్యూటీ.. ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు నేర్చుకుని పెద్ద పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకోవడానికి ట్రై చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.


ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసే ఫోటోలు చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బికినీల్లో దిగిన పిక్స్ ను కుప్పలు తెప్పలుగా షేర్ చేస్తుంటోంది. పొట్టి బట్టలు వేసుకుని స్కిన్ షో చేస్తూ సందడి చేస్తుంటోంది. తెలుగులో భారీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలు ఆరబోస్తుంటోంది. మినీ ఔట్ ఫిట్స్ లో ఓ రేంజ్ లో మాయ చేస్తుంటోంది.


తాజాగా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ పొట్టి డ్రెస్ లో కిర్రాక్ పోజులిచ్చింది. ఫ్లర్టింగ్ విత్ కెమెరా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎద అందాలతో కవ్విస్తూ.. థైస్ షోతో మతులు పోగుడుతోంది. ప్రస్తుతం దేవియాని శర్మ కొత్త పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడు గ్లామర్ ను చూసి కంప్లీట్ గా ఫ్లాట్ అయ్యామని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. పొట్టి డ్రెస్ లో బ్యూటీని చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అంటూ సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News