శరత్‌కుమార్‌పై ధనుష్ తల్లి కోర్టుకు!
తమిళ స్టార్ హీరో ధనుష్ తల్లి విజయలక్షి మాజీ నడిగర సంఘం అధ్యక్షుడు, సీనియర్ నటుడు శరత్ కుమార్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది
తమిళ స్టార్ హీరో ధనుష్ తల్లి విజయలక్షి మాజీ నడిగర సంఘం అధ్యక్షుడు, సీనియర్ నటుడు శరత్ కుమార్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అతడు తమ అపార్ట్మెంట్ లోని పై అంతస్తును ఆక్రమించాడని ఆమె ఆరోపించారు. ఇది నివాసితులందరికీ కామన్ స్పేస్. కానీ శరత్‌కుమార్ ఆ అంతస్తును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. ధనుష్ తల్లి తన భర్తతో కలిసి చెన్నై థియాగరాజా నగర్ లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. ధనుష్ తల్లి సహా అపార్ట్ మెంట్ బ్లాక్ లోని మరికొందరు నివాసితులు చెన్నై కార్పొరేషన్ అధికారులకు శరాత్‌కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఇండియాగ్లిట్జ్ తమిళం కథనం ప్రకారం.. చెన్నై కార్పొరేషన్ వారి ఫిర్యాదు సరిగ్గా వినలేదని, దీనివల్ల ధనుష్ తల్లి మద్రాస్ హైకోర్టును సంప్రదించారని తెలుస్తోంది. ఈ కేసులో జూన్ 5న తన స్పందనను సమర్పించాలని కోర్టు ఇప్పుడు శరత్ కుమార్‌ను కోరింది. ధనుష్, శరాత్‌కుమార్ గతంలో కలిసి పనిచేయలేదు. అయితే 2015 లో ధనుష్ తమిళ చిత్రం తంగమగన్ లో శరత్‌కుమార్ భార్య రాధికా శరత్ కుమార్ తో కలిసి నటించారు.
ధనుష్ త్వరలో `రాయన్` అనే చిత్రంలో కనిపించనున్నారు. నార్త్ చెన్నై నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం నటుడిగా ధనుష్ కి 50వ సినిమా కాగా, దర్శకుడిగా అతడికి 2వ చిత్రం. ఇందులో కలిదాస్ జయరామ్, సుందీప్ కిషన్, ఎస్జె సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. డిసెంబరులో చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ జరుగుతోంది. న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్ కోసం భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ ఆడియో వేదికపై రాయన్ స్వరకర్త అర్ రెహ్మాన్ సంగీత కచేరీని నిర్వహిస్తారని సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాయన్ జూన్ 13న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పని ఇంకా పూర్తి కానందున ఈ చిత్రం విడుదల తేదీ ఆలస్యం అయింది. రాయన్ ఇప్పుడు జూలైలో విడుదల కావచ్చని కథనాలొస్తున్నాయి.
రాయన్‌తో పాటు ధనుష్ తదుపరి శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరలో నటిస్తున్నాడు. మారి సెల్వరాజ్ డి 52, అరుణ్ మాథేశ్వరన్ `ఇలైయరాజా బయోపిక్`లోను నటిస్తున్నాడు. `నీలవుక్కు ఎన్మెల్ ఎన్నాడి కోబామ్` (నీక్) అనే చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.