అమెరికాలో 'ధూం ధాం'.. టైమ్ స్క్వేర్ పై మల్లెపూల టాక్సీ!

అందులో భాగంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మల్లెపూల టాక్సీ పాటను ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2024-09-07 10:16 GMT

అమెరికా.. తెలుగు సినిమా.. ఈ రెండింటికీ మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని సినిమాలు యూఎస్ లో రిలీజ్ అవుతుంటాయి. ఇక్కడే కాదు.. అక్కడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ సత్తా చాటుతుంటాయి. ప్రీమియర్స్ షోస్ కూడా పడుతుంటాయి. అయితే ఓవర్సీస్ అంతటా తెలుగు సినిమాలకు భారీ ఆదరణ ఉన్నా.. అమెరికాలో మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది.

అదే సమయంలో న్యూయార్క్ లోని ఫేమస్ టైమ్ స్క్వేర్ బోర్డు పై పలు సినిమాలకు సంబంధించిన సాంగ్స్, గ్లింప్సెస్ ప్లే అవుతుంటాయన్న విషయం తెలిసిందే. వాటిలో ఇండియన్ మూవీస్ తక్కువే ఉంటాయి. అయితే తాజాగా టాలీవుడ్ మూవీ ధూం ధాం.. అరుదైన ఘనత సాధించింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఆ మూవీలోని మల్లెపూల టాక్సీ వీడియో సాంగ్.. టైమ్ స్క్వేర్ వద్ద ప్లే అయింది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ధూం ధాం మూవీ సెప్టెంబర్ 13వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతకుముందు రోజు సెప్టెంబర్ 12వ తేదీన యూఎస్ లో ప్రీమియర్స్ వేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మల్లెపూల టాక్సీ పాటను ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మల్లెపూల టాక్సీ సాంగ్ స్క్రీనింగ్ కు భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనేక మంది విచ్చేశారు. సాంగ్ ను టైమ్ స్క్వేర్ బోర్డు పై చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చిన ఎన్ ఆర్ ఐ మహిళలు.. డ్యాన్సులతో సందడి చేశారు. అంతా కలిసి నృత్యం చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇండో అమెరికన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ధూం ధాం చిత్రానికి సాయి కిషోర్‌ మచ్చా దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ మోహన్‌ స్టోరీ అండ్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. రామ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే టైమ్ స్క్వేర్ బోర్డు పై ప్లే అయిన మల్లెపూల టాక్సీ సాంగ్ ను సింగర్ మంగ్లీ పాడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News