అనంత్ అంబానీ తెలిసే ఈ త‌ప్పు చేసాడా?

అంబానీ ఇంటిలో జరిగిన గణపతి వేడుకల నుండి ఇటీవల షేర్ చేసిన వీడియో వీక్షించాక‌ అనంత్ అంబానీ ప్ర‌వ‌ర్త‌న‌ను చాలా మంది త‌ప్పు ప‌డుతున్నారు.

Update: 2024-09-09 16:29 GMT

త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద వాడైన స‌ల్మాన్ ఖాన్ భుజంపై త‌న చేతిని వేసిన అనంత్ అంబానీ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెటిజ‌నుల్లో చ‌ర్చ‌కు తెర‌లేపాయి. అత‌డు యారోగెంట్ గా ప్ర‌వ‌ర్తించాడ‌ని, త‌ప్పు చేసాడ‌ని చాలా మంది నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంబానీ ఇంటిలో జరిగిన గణపతి వేడుకల నుండి ఇటీవల షేర్ చేసిన వీడియో వీక్షించాక‌ అనంత్ అంబానీ ప్ర‌వ‌ర్త‌న‌ను చాలా మంది త‌ప్పు ప‌డుతున్నారు. ఇది ధ‌న‌మ‌దం అంటూ కొంద‌రు తిట్టిపోస్తున్నారు.

సల్మాన్ ఖాన్ త‌న కంటే వ‌య‌సులో చాలా పెద్ద‌వాడు. అత‌డి వ‌య‌సు దాదాపు ష‌ష్ఠిపూర్తి కి చేరువ‌లో ఉంది. 58 వ‌య‌సులో అత‌డు బాలీవుడ్ జెంటిల్మ‌న్ గా ఎంతో గౌర‌వం అందుకుంటున్నాడు. బాలీవుడ్‌లో పాపుల‌ర్ నేమ్ మాత్రమే కాదు.. అతని వయస్సు రెండింతలు ఎక్కువ కాబట్టి అనంత్ అంబానీ గౌరవంగా వ్య‌వ‌హ‌రించాల్సింద‌ని చాలా మంది సూచిస్తున్నారు. ప్రాథమిక మర్యాద ముఖ్యం అని సూచిస్తున్నారు.

గ‌తంలోను కొన్నిసార్లు అనంత్ అంబానీ అహంకార ప్రవర్తనకు సంబంధించిన చాలా వీడియోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. ప‌లువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతో అత‌డి అతి చ‌నువు.. అమ‌ర్యాద‌కు సంబంధించిన‌ ఒక పాత వీడియో వైరల్ అయ్యింది. అందులో త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద ఉద్యోగి ఒకరు అనంత్ పాదాలను తాకడం కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఇప్పుడు సల్మాన్ భుజాల‌పై అమ‌ర్యాద‌గా చెయ్యి వేయ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు.

అయితే స‌ల్మాన్ ఖాన్ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఇత‌ర రంగాల ప్ర‌ముఖులంతా అంబానీల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్నారు. వారి ప్ర‌తి ఈవెంట్ లోను వారంతా సంద‌డి చేస్తున్నారు. అదే క్ర‌మంలో అనంత్ అంబానీ ప్ర‌ముఖులంద‌రికీ అత్యంత స‌న్నిహితుడిగా మారి ఉండొచ్చు. కానీ దానిని అత‌డు ఇలా అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌య‌సు రీత్యా అయినా స‌ల్మాన్ తో అలా ప్ర‌వ‌ర్తించాల్సింది కాద‌ని భావిస్తున్నారు. అనంత్ అంబానీ 29 సంవ‌త్స‌రాల కిడ్ ఇంకా. త‌న‌కంటే స‌ల్మాన్ వ‌య‌సు దాదాపు రెట్టింపు ఉంది.

Tags:    

Similar News