రాజ‌మౌళి వార‌సుడు డైరెక్ట‌ర్ అవ్వ‌డా?

ఆ త‌ర్వాతే రాజ‌మౌళి ప్ర‌తిభ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2024-03-23 02:45 GMT

రాజ‌మౌళి తండ్రి పెద్ద రైట‌ర్....ఇండియాలోనే ఎంతో ఫేమ‌స్ రైట‌ర్ గా పేరుంది. అత‌నే విజ‌యేంద్ర ప్ర‌సాద్. అత‌ని చ‌ల‌వ‌తోనే రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఆయ‌న రాసిన క‌థ‌ల‌కు అద్భుత‌మైన దృశ్య‌రూపం ఇచ్చి సినిమాలు గా తెర‌కెక్కిస్తున్నాడు. నేడు పాన్ ఇండియాని దాటి రాజ‌మౌళి పేరు పాన్ వ‌ర‌ల్డ్ లో వెలిగిపోతుందంటే? అందుకు కార‌ణం ఆయ‌నే. ఆ త‌ర్వాతే రాజ‌మౌళి ప్ర‌తిభ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


తండ్రి ఇమేజినేష‌న్ ని త‌న‌యుడు ఎంతో చ‌క్కాగా దృశ్య‌రూపం ఇవ్వ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. ఈగ‌...బాహుబ‌లి... ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు తండ్రీ కొడుకుల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసాయి. ఇది తండ్రీకొడుకులుగా వాళ్లిద్ద‌రి ట్రాక్ రికార్డు. మ‌రి రాజ‌మౌళి-ర‌మ‌లా వార‌సుడు కార్తికేయ ప‌రిస్థితి ఏంటి? తండ్రిలా తాను పెద్ద ద‌ర్శకుడు అవుతాడా? అన్న‌ది చూడాలి. అయితే కార్తికేయ ఇప్ప‌టికే ఎడిటింగ్ రంగంలో అపార అనుభ‌వం సాధించాడు.

ఎన్నో గొప్ప చిత్రాల‌కు బ్యాకెండ్ వర్క్ చేసాడు. ఎడిటర్ గా అత‌నికి మంచి గుర్తింపు ఉంది. బాహు బ‌లి..ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు అంత గొప్ప‌గా వ‌చ్చాయి అంటే అత‌డు ప్ర‌తిభ ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌లే నిర్మాత‌గానూ మారాడు. ఇత‌ర నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి అనువాద చిత్రాలు ప్రేక్ష‌క‌లుకు అందించ‌డం మొదలు పెట్టాడు. మ‌ల‌యాళం సినిమా `ప్రేమ‌లు` అనే చిత్రంతో పంపిణీ..నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు.

ఇంకా కొత్త చిత్రాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ కార్తికేయ నుంచి రాజ‌మౌళి అభిమానులు కోరుకునేది అంత‌కు మించి అని అభిమానుల అంటోన్న మాట‌. త‌న‌యుడిని తండ్రిలా పెద్ద ద‌ర్శ‌కుడిలా చూడాల‌నుకుంటున‌ట్లు చెబుతున్నారు. రాజ‌మౌళి త‌ర్వాత త‌రాన్ని కొన‌సాగించాలం టే? ప‌రిశ్ర‌మ‌కి మేక‌ర్ గా కార్తికేయ అవ‌స‌రం ఎంతైనా ఉంది అంటున్నారు. చాలా కాలంగా సినిమా వాతావర‌ణంలోనే ఉంటున్నాడు కాబ‌ట్టి అత‌డు క్రియేటివ్ రంంలో రాణించాల‌ని అభిమానులు ఆశ‌ప‌డు తున్నారు.

మ‌రి ఈ విష‌యం గురించి కార్తికేయ సీరియ‌స్ గా ఆలోచ‌న చేస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతానికి రాజ‌మౌళి సినిమాల‌తోనే స‌మ‌యం స‌రిపోతుంది. కొత్త‌గా ఆలోచించే స‌మ‌యం కూడా కార్తికేయ‌కి ఇవ్వ‌డం లేదు. రాజ‌మౌళి హ‌వా కొన‌సాగినంత కాలం కార్తికేయ కెప్టెన్ కుర్చీకి దూరంగానే ఉంటాడా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News