'చిరు' కథ ఆ హీరో దగ్గరకు వెళ్ళిందా?
చివరిగా నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి.. భగవంత్ కేసరి సినిమాతో నటసింహం అభిమానులతోపాటు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి . ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలతోనూ హిట్లు అందుకున్నారు. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా పేరు పొందారు. చివరిగా నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి.. భగవంత్ కేసరి సినిమాతో నటసింహం అభిమానులతోపాటు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు.
ఇక అనిల్ రావిపూడి తన తర్వాత మూవీ.. ఎవరితో చేయబోతున్నారన్న చర్చ ఆ మధ్య టాలీవుడ్ లో బాగా జరిగింది. ఆ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసుకుని అనిల్ రావిపూడి ఆయన వద్దకు వెళ్లినట్లు టాక్ వినిపించింది. అయితే స్టోరీ లైన్ ను మెచ్చుకున్న చిరు.. తనకు సెట్ కాదేమోనని రిజెక్ట్ చేశారట.
ఇక, ఇప్పుడు అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేశ్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ పై ఆ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే అప్పుడు చిరంజీవి కోసం అనిల్ రావిపూడి రెడీ చేసిన స్క్రిప్టే.. వెంకీ మామ విని సినిమాకు ఓకే చెప్పారని కొందరు అంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం చిరు కోసం రెడీ చేసిన స్టోరీ క్యాన్సిల్ చేయలేదని, అది అలానే ఉందని చెబుతున్నారు. వెంకీ మామ కోసం పక్కా విలేజ్ డ్రాప్ లో అనిల్ రావిపూడి మరో ఫ్రెష్ స్టోరీ రెడీ చేశారని అంటున్నారు. అయితే వెంకీ- అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే తెరకెక్కిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి.
2025 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట దిల్ రాజు. అయితే సంక్రాంతికి ఇప్పటికే శతమానం భవతి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో రెండింటినీ బరిలో దింపుతారా? లేక ఒకదాన్ని ఆపి తర్వాత రిలీజ్ చేస్తారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే విశ్వంభర, జై హనుమాన్ సినిమాలు నెక్స్ట్ పండుగ రేసులో ఉన్నాయి.