వాళ్లకిచ్చినవి రెండు కోట్లైతే అనంత్ చేతివి ఎంతో తెలుసా?
ప్రీ వెడ్డింగ్ ల నుంచి పెళ్లి తంతు పూర్తయ్యే వరకూ దేశమంతా పండగే అన్నంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు.
అపర కుబేరుడు ముకేష్ అంబానీ-నీతా అంబానీలకు చిన్నకుమారుడు అనంత్ అంబానీ అంటే ఎంత ఇష్టమో పెళ్లితో మరోసారి ప్రూవ్ అయింది. తమ స్థాయికి తగ్గ అందమైన మ్మాయిని రాధిక మర్చంట్ ని ఇచ్చి వివాహం చేసారు. ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు కావొచ్చు. కానీ అంబానీ ఇంట జరిగిన పెళ్లి తంతు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రీ వెడ్డింగ్ ల నుంచి పెళ్లి తంతు పూర్తయ్యే వరకూ దేశమంతా పండగే అన్నంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఇది అంబానీకి మాత్రమే సాధ్యమని నిరూపించారు.
ఇక ఈ పెళ్లి కోసం అంబానీ ప్రత్యేకమైన బంగారు దుస్తుల్లోనూ మెరిసిన సంగతి తెలిసిందే. ఇక మహిళలు దరించి వజ్రవైఢూర్యాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్ల నీతా అంబానీ దగ్గర నుంచి అంతా బంగారు అభరణాల్లో ధగధగలాడారు. అలాగే ఈవెంట్ లో ప్రత్యేకంగా బ్రాండెడ్ వాచీలు సైతం హైలైట్ అయ్యాయి. వచ్చిన అతిధులకే రెండు కోట్ల విలువ చేసే వాచీలు ఇచ్చారంటే? అనంత్ అంబానీ ఇంకే రేంజ్ వాచీలు దరించి ఉంటారో? ఊహకి కూడా అందనిది.
ఇతడి వద్ద 10 పస్ట్ క్లాస్ ఖరీదైన లగ్జరీ బ్రాండెడ్ వాచ్ లు పెట్టుకుంటాడని తెలుస్తోంది. ఓసారి వాటిపై ఓ లుక్ ఏస్తే ..పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చిమ్. అనంత్ అంబానీకి గ్రాండ్ మాస్టర్ చైమ్‌తో సహా పాటెక్ ఫిలిప్ నుండి 2 లగ్జరీ వాచీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 వాచీలు మాత్రమే ఉత్పత్తి చేయగా,, ఈ వాచ్ చాలా అరుదైన వాచ్‌గా పరిగణిస్తారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.67.5 కోట్లు. పటేక్ ఫిలిప్ తయారు చేసిన రెండవ అత్యంత సంక్లిష్టమైన వాచ్‌గా స్కై మూన్ టూర్‌బిల్లాన్ మరో వాచ్.
ఈ వాచ్ ధర రూ.54 కోట్లు. మందపాటి 44 మిమీ టైటానియం కేస్‌ను కలిగి ఉన్న రాయల్ ఓక్ కాన్సెప్ట్ జీఎమ్ టీ టూర్‌బిల్లాన్ గడియారం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ,ప్రత్యేకమైన సేకరణలలో ఒకటైన రాయల్ ఓక్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించారు. దీని ఖరీదు 1.9 కోట్లు. పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ అనేది పూర్తిగా రూబీ , డైమండ్-పొదిగిన తెల్లని బంగారంతో తయారు చేయబడిన విలాసవంతమైన వాచ్. నాటిలస్ సేకరణలో అత్యంత విలాసవం తమైన ట్రావెల్ వాచ్ ఇది.
పూర్తి రూబీ సెట్, డైమండ్ పొదిగిన వాచ్ ధర రూ. 8.2 కోట్లు. నీలమణి క్రిస్టల్‌లోని రిచర్డ్ మిల్లే ఆర్ ఎమ్ 56-01 అత్యంత ఘనమైన, లగ్జరీ స్పోర్ట్స్ వాచీలలో ఒకటి ఇది. రిచర్డ్ మిల్లె నిర్మించిన అత్యంత ఖరీదైన గడియారాలలో ఇది ఒకటి. దీని ధర రూ.25 కోట్లు. ఇలాంటి వాచీలు ఇంకా మరో ఐదు ఉన్నాయి. ప్రతీదానికి దేని ప్రత్యేక దానికుంది. అన్నింటి ధర కోట్లలోనే పలుకుతుంది.