IIFA డిజిటల్ అవార్డ్స్- 2025 విజేతల జాబితా

రెండు ప్ర‌ముఖ‌ స్ట్రీమింగ్ దిగ్గజాలు భారీగా అవార్డుల‌ను గెలుచుకుని స‌త్తా చాటాయి. ఇది అమెజాన్‌కు ప్రైమ్ నైట్ .. నెట్‌ఫ్లిక్స్‌కు చిల్ నైట్.;

Update: 2025-03-09 07:11 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క IIFA డిజిటల్ అవార్డ్స్ -2025 వేడుకలు జైపూర్‌లో కన్నుల పండుగ‌గా సాగాయి. స్ట్రీమింగ్‌లో దూకుడు మీద ఉన్న స్టార్లు ఈ వేదిక‌పై కొలువు దీరారు. రెండు ప్ర‌ముఖ‌ స్ట్రీమింగ్ దిగ్గజాలు భారీగా అవార్డుల‌ను గెలుచుకుని స‌త్తా చాటాయి. ఇది అమెజాన్‌కు ప్రైమ్ నైట్ .. నెట్‌ఫ్లిక్స్‌కు చిల్ నైట్.

పాపుల‌ర్ విలేజ్ డ్రామా సిరీస్ 'పంచాయత్'.. ఇంతియాజ్ అలీ మ్యూజిక‌ల్ బయోపిక్ 'అమర్ సింగ్ చమ్కిలా' ఐఫా వేదిక‌గా అవార్డులు కొల్ల‌గొట్టి అందరి దృష్టిని ఆకర్షించాయి. కృతి సనన్, విక్రాంత్ మాస్సే వంటి తార‌లు అవార్డుల‌తో గౌర‌వం అందుకున్నారు. సినిమాలు, సిరీస్ ల‌తో డిజిటల్ స్క్రీన్‌ను పాలించిన న‌టీన‌టులు, సినిమాల వివ‌రాలతో పూర్తి జాబితా ఇది.

ఐఫా -2025 పుర‌స్కారాల వివ‌రాలు:

*ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలా

* ఉత్త‌మ క‌థానాయిక (సినిమా) : కృతి సనన్ (దోప‌ట్టి)

* ఉత్త‌మ న‌టుడు (సినిమా) : విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)

*ఉత్తమ దర్శకత్వం (సినిమా): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)

* ఉత్త‌మ స‌హాయ న‌టి (సినిమా): అనుప్రియ గోయెంకా (బెర్లిన్)

* ఉత్త‌మ స‌హాయ న‌టుడు (సినిమా): దీపక్ డోబ్రియాల్ (సెక్టార్ 36)

*ఉత్తమ కథా ర‌చ‌యిత‌- ఒరిజినల్ (సినిమా): కనికా ధిల్లాన్ (దో పట్టి)

వెబ్ సిరీస్ విభాగంలో...!

*ఉత్తమ వెబ్ సిరీస్: పంచాయత్ సీజన్ 3

* ఉత్త‌మ న‌టి: శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)

* ఉత్త‌మ న‌టుడు : జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)

* ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)

* ఉత్త‌మ స‌హాయ న‌టి : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)

* ఉత్త‌మ న‌టుడు : ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)

ఇతరాలు

* ఉత్తమ కథ ఒరిజినల్ (సిరీస్): కోటా ఫ్యాక్టరీ సీజన్ 3

* సహాయక పాత్రలో నటన, పురుషుడు (సిరీస్): పంచాయత్ సీజన్ 3 కోసం ఫైసల్ మాలిక్

* ఉత్తమ రియాలిటీ లేదా ఉత్తమ నాన్-స్క్రిప్టెడ్ సిరీస్: ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

* ఉత్తమ డాక్యుసిరీస్/డాక్యు ఫిల్మ్: యో యో హనీ సింగ్: ఫేమస్

* ఉత్తమ టైటిల్ ట్రాక్: మిస్‌మ్యాచ్డ్ సీజన్ 3 నుండి 'ఇష్క్ హై' కోసం అనురాగ్ సైకియా

Tags:    

Similar News