త‌న పెళ్లిపై అన్ని డౌట్ల‌కు స్టార్ సింగ‌ర్ చెక్‌

గాయ‌కుడు కం నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇటీవల ఫిగరింగ్ అవుట్ పోడ్‌కాస్ట్‌ సమయంలో తన `తొలి ప్రేమ` గురించి ఓపెన‌య్యాడు.

Update: 2024-06-17 03:56 GMT

గాయ‌కుడు కం నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇటీవల ఫిగరింగ్ అవుట్ పోడ్‌కాస్ట్‌ సమయంలో తన `తొలి ప్రేమ` గురించి ఓపెన‌య్యాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడంలో పేరుగాంచిన దిల్జిత్, తన ల‌వ్ లైఫ్ కి సంబంధించి నిరంతర పుకార్లపై ఇంత‌కాలం మౌనంగా ఉన్నాడు . ఆ పుకార్లలో అతడికి పెళ్లయిందని , ఒక బిడ్డ ఉందని కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఈ పుకార్లను నేరుగా ప్రస్తావించకుండా దిల్జీత్ దోసాంజ్ తన మొదటి ప్రేమ గురించి అడిగినప్పుడు తెలివిగా ప్రతిస్పందించాడు.

మొదటి ప్రేమ గురించి ప్ర‌శ్నించ‌గా.. దిల్జిత్ స్వీయ ప్రేమ ప్రాముఖ్యత గురించి చెప్పాడు. నేను నన్ను చాలా ప్రేమిస్తున్నాను.. నేనే నా మొదటి మొదటి ప్రేమ అని నమ్ముతున్నాను! అని దిల్జిత్ చెప్పాడు. ఇతరులను ప్రేమించే ముందు తనను తాను ప్రేమించుకోవాలనేది తాను నమ్ముతానని కూడా చెప్పాడు. ముందు నిన్ను నువ్వు చూసుకో. నిన్ను మొదట ప్రేమించి చూసుకోకపోతే ఆ ప్రేమను వేరొకరికి ఎలా ఇస్తావు? అని ప్ర‌శ్నించాడు.

ఆధునిక ప్రేమ vs పాత పాఠశాల ప్రేమ గురించి అతడిని ప్ర‌శ్నించ‌గా.. కాలం మారుతోంద‌ని.. ఇది సంబంధాలపై కూడా ప్రతిబింబిస్తుందని దిల్జిత్ అన్నాడు. ఇంతకుముందు దూరదర్శన్ ఉండేది.. అది మన‌కు ఉన్న ఏకైక ఛానెల్. ఇప్పుడు చాలా ఛానెల్స్ ఉన్నాయి. అలాగే ఆహార ప్రాధాన్యతలు మారాయి.. సంభాషణలు మారాయి.. యుగం మారింది`` అని ఆయన అన్నారు. భాగస్వామి కోసం చెక్‌లిస్ట్ గురించి అడిగినప్పుడు దిల్జిత్ స్వీయ-ప్రేమ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాడు. ప్రజలు మొదట తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు.

దిల్జిత్‌కు ఇండో-అమెరికన్ భార్య ఉందని, వారికి ఒక కుమారుడు ఉన్నారని అతని స్నేహితుడు పేర్కొన్నట్లు జాతీయ దిన ప‌త్రిక‌ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గతంలో పేర్కొంది. వారు అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. 2019 లో కియారా అద్వానీ కూడా దిల్జిత్‌కు ఒక‌ బిడ్డ ఉందని హింట్ ఇచ్చింది. కానీ దిల్జీత్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మీడియా ఎదుట అస్స‌లు మాట్లాడ‌డు.

Tags:    

Similar News