ఈ సారి కింగ్ సైజ్ ప్లానింగ్ తో..!

రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా లాక్ చేసుకున్నాడు. అలానే హర్ష కూడా నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తుంది.

Update: 2024-12-04 09:30 GMT

కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత నెక్స్ట్ చేసే సోలో సినిమా ఏంటన్నది తెలుసుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆల్రెడీ ధనుష్ కుబేర, రజిని కూలీ సినిమాల్లో నాగార్జున నటిస్తున్నారు. పాత్ర నచ్చితే ఎవరితో అయినా కలిసి నటించే నాగార్జున మల్టీస్టారర్ సినిమాలతో ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇవ్వనున్నాడు. ఐతే నా సామిరంగ తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్ తోనే మరో సినిమా ఉంటుందని వార్తలు రాగా లేటెస్ట్ గా నాగ్ నెక్స్ట్ సినిమాపై ఒక కొత్త టాక్ మొదలైంది.

కింగ్ నాగార్జున యువ దర్శకుడు హర్షతో కలిసి సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. హుషారు, ఓం భీం బుష్ సినిమాలతో యూత్ ఫుల్ హిట్ అందుకున్న దర్శకుడు హర్ష తన థర్డ్ ప్రాజెక్ట్ ఏకంగా కింగ్ నాగార్జుననే లైన్ లో పెట్టాడు. అతను చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

నాగార్జున నా సామిరంగ తో సూపర్ ఫాం లోకి వచ్చారు. ఐతే హిట్ పడిన వెంటనే మరో సినిమా చేస్తారని అనుకుంటే మధ్యలో మల్టీస్టారర్ సినిమాల వల్ల లేట్ అవుతూ వచ్చాయి. ఐతే ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. అందుకే ఒక సూపర్ హిట్ స్టోరీతోనే ఆయన రాబోతున్నారట. హర్ష కూడా నాగార్జున కోసం ఒక కింగ్ సైజ్ స్టోరీ సిద్ధం చేశాడట.

ఈమధ్య సీనియర్ హీరోలు యువ దర్శకుల మీద గురి పెట్టారు. వాళ్లైతేనే ఫ్రెష్ స్టోరీస్ తో తమ ఇమేజ్ కు తగిన సినిమాలు చేస్తారని భావిస్తున్నారు. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా లాక్ చేసుకున్నాడు. అలానే హర్ష కూడా నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తుంది.

కుబేర, కూలీ సినిమాల తర్వాత నాగార్జున చేసే సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున మాత్రం ఈసారి టార్గెట్ హిట్ అనిపించేలా చేస్తున్నాడు. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుంది.. ఏ జోనర్ లో ఉంటుంది అన్నది చూడాలి. నా సామి రంగ లానే సంక్రాంతికి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తారని అనుకోగా నాగార్జున కథల ఎంపిక లేట్ అవ్వడం వల్ల 2025 సంక్రాంతి మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News