కెరీర్‌లో 60 హిట్ సినిమాలు తీసిన ఏకైక‌ డైరెక్ట‌ర్

స‌ద‌రు ద‌ర్శ‌కుడు తన జీవితంలో వందకు పైగా సినిమాలు తీయడమే కాకుండా ఏకంగా 60 హిట్‌లను అందించగలిగాడు.

Update: 2024-01-30 15:30 GMT

భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకులుగా పేరున్న‌ రాజమౌళి, రోహిత్ శెట్టి, భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణీ వీరంతా క‌లిసినా కానీ మొత్తంగా 60 హిట్ సినిమాలు తీయ‌లేదు. కానీ ఆ ద‌ర్శ‌కుడు ఒక్క‌డే కెరీర్ లో 60 పైగా హిట్ సినిమాల‌ను తీసాడు. 141 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే స‌గ‌భాగం విజ‌యాలు వ‌రించాయి. ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.


ద‌ర్శ‌కులు ఎవ‌రూ స్టార్ల‌ మాదిరిగా వేగంగా సినిమాలు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టుల కోసం వెళ్ల‌లేరు. న‌టీన‌టులు ఒకే స‌మ‌యంలో మ‌ల్టీటాస్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది.. కానీ ద‌ర్శ‌కులకు అలా కుద‌ర‌దు. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా తదుపరి ప్రాజెక్ట్‌కి వెళ్లే ముందు తమ సమయాన్ని ఒక ప్రాజెక్ట్‌కు కేటాయించాలి. అయితే చాలా తక్కువ సమయంలో ఎక్కువ‌ చిత్రాలను వేగంగా తెర‌కెక్కించి స‌క్సెసైన ఫిలింమేక‌ర్ ఒక‌రు ఉన్నారు. స‌ద‌రు ద‌ర్శ‌కుడు తన జీవితంలో వందకు పైగా సినిమాలు తీయడమే కాకుండా ఏకంగా 60 హిట్‌లను అందించగలిగాడు.

మలయాళ వెట‌ర‌న్ దర్శకుడు జె శశికుమార్ గురించే ఇదంతా. తన అద్భుతమైన ఫిలింమేకింగ్ ట్యాలెంట్ కారణంగా అనేక రికార్డులను సృష్టించిన శ‌శి తన జీవితకాలంలో 141 చిత్రాలను తీశారు. చరిత్రలో ఏ భారతీయ ఫిలింమేక‌ర్ ఇంత స‌క్సెస్ రేటుతో లేరు. మొత్తం 141 చిత్రాల్లో 60కి పైగా సినిమాలు హిట్ అయ్యాయి. శశికుమార్‌కి అత్యంత విజయవంతమైన భారతీయ చలనచిత్ర నిర్మాతగా బిరుదు లభించింది. ఏ ఆధునిక చిత్రనిర్మాత ఆయ‌న ద‌రిదాపుల్లోకి రాకపోవడాన్ని బట్టి ఈ సంఖ్య ఎంత ఎక్కువ అన్న‌ది అంచనా వేయవచ్చు. ఎస్ఎస్ రాజమౌళికి 11 హిట్స్ ఉండగా, రోహిత్ శెట్టికి 10, రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భ‌న్సాలీకి 6 హిట్స్ ఉన్నాయి. మొత్తంగా వీరంద‌రూ క‌లిసి శశికుమార్ లో స‌గం స‌క్సెస్ అయినా ఇంకా సాధించ‌లేదు.

శశికుమార్ విజయ రహస్యం

1927లో జన్మించిన శశికుమార్ సినీకెరీర్ ఆరంభం చాలా డ్ర‌మ‌టిక‌ల్ గా ఉంటుంది. అత‌డు మొదట్లో విలన్‌గా న‌టించాడు. 60వ దశకంలో ఫిలింమేకింగ్ లో పట్టభద్రుడయ్యాడు. ఆరంభంలో కళాత్మక చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేసేవాడు. కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. కానీ 1966 తర్వాత తన స్నేహితుడు, సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ సలహా మేరకు కమర్షియల్ సినిమాల వైపు మళ్లాడు. శశికుమార్ ద‌ర్శ‌కుడిగా చాలా ఫలవంతమ‌య్యారు. కేవలం రెండు వారాల్లో షూటింగ్‌లను ముగించి తదుపరి స్క్రిప్ట్ ప‌నుల్లోకి వెళ్లేవాడంటే అత‌డు ఎంత వేగంగా సినిమాలు తీసేవాడో అర్థం చేసుకోవాలి. 1970లు 80ల వరకు సంవత్సరానికి 6-8 సినిమాలు తీసిన మేటి ద‌ర్శ‌కుడు. 1977లో అతడు 15 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో 10 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శశికుమార్ తన కెరీర్‌లో 83 చిత్రాలకు తన స్నేహితుడు నజీర్‌తో కలిసి పనిచేశారు.


Tags:    

Similar News