గోపీచంద్‌ను తిట్టడం నా తప్పే..తప్పు అంగీకరించిన డైరెక్టర్
టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ ముందు హీరోగా, ఆ తరువాత విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ ముందు హీరోగా, ఆ తరువాత విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే విలన్‌గా కొనసాగుతున్న ఆయనని మళ్లీ హీరోగా `యజ్ఞం` సినిమాతో నిలబెట్టిన దర్శకుడు ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. ఆ తరువాత `సౌఖ్యం` మూవీని రూపొందించారు. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత గోపీచంద్ తో ఏ.ఎస్. కుమార్ చౌదరి మరో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం ఆయన రాజ్ తరుణ్ హీరోగా `తిరగబడరాసామీ` సినిమాని రూపొందిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దు పెట్టి దర్శకుడు రవికుమార్ చౌదరి షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తనకు లేని నొప్పి మీకేంటి అంటూ నెటిజన్లపై, మీడియాపై ఫైర్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్‌పై ఇండైరెక్ట్‌గా తిడుతూ వార్తల్లో నిలిచారు.
ఒరేయ్..అంత బలిసిందారా నీకు.. అంటూ హీరో గోపీచంద్‌పై విరుచుకుపడ్డారు. తనని కలవాలని వెలితే క్యారవాన్‌లో ఉండి వేయిట్ చేయించడాని మండిపడ్డారు. ఇంత బులుపు ఎలా ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో దర్శకుడు ఏ.ఎస్. రవికుమార్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై గోపీచంద్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పచ్చిగా తాగి వాడుతున్నాడని మండిపడ్డారు.
సదరు దర్శకుడికి ఫోన్లు చేసి క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చయరించారట. దీంతో దర్శకుడు ఏ.ఎస్. రవికుమార్ తాను చేసి వ్యాఖ్యలపై దిగొచ్చారు. తాజాగా మరో యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల రిగ్రెట్ ఫీలవుతున్నానని, గోపీచంద్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని, నాకు ఆయన బిడ్డలాంటి వాడని, తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. నా వల్ల హర్ట్ అయిన గోపీచంద్ అభిమానులు నాకు ఫోన్లు చేస్తున్నారు` అని తెలిపారు ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. తాజా వివరణతో గోపీచంద్‌తో ఆయన వివాదం సమసినట్టేనని కొంత మంది ఇండస్ట్రీ వర్గాలు అంటుంటే అభిమానులు మాత్రం డైరెక్టర్ తాగినప్పుడు ఒకలా, తాగనప్పుడు మరోలా మాట్లాడుతున్నాడని ఫైర్ అవుతున్నారు.