రిటైర్మెంట్ విరమించుకున్న లోకేష్ కనగరాజ్!
కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ ఆ మధ్య సంచలన రిటైర్మెంట్ ప్రకటనతో అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ ఆ మధ్య సంచలన రిటైర్మెంట్ ప్రకటనతో అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులకే కాదు కోలీవుడ్ సహా టాలీవుడ్ కూడా ఈ ప్రకటనపై షాక్ అయింది. వరుస విజయాలంతో మంచి ఫాం లో ఉన్న లొకేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఏంటని పెద్ద చర్చనీయాంశమైంది. `పది సినిమాల తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని...దర్శకుడిగా తాను గర్వపడిన స్థాయిలో ఉన్నప్పుడు రిటైర్ అవుతాననని...ఆ తర్వాత ప్రపంచం మొత్తం తిరుగు తానని..అంతకు మించి జీవితానికి ఇంకేమి అవసరం లేదని` చేసిన వ్యాఖ్యల పట్ల అంతా విస్తుపోయారు.
దీంతో అతడికి డబ్బు పై ఆశలేదు.. సంపాదించిన ఐడెంటిటీతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆశ..కోరి కూడా లేవని తేలిపోయింది. తాను దర్శకుడి గా సక్సెస్ అవ్వాలనుకున్నాడు..అయి నిరూపిం చాడు. ఇప్పుడా కెప్టెన్ కుర్చీపై పూర్తిగా వ్యామోహం తొలగిపోయి సాధారణ జీవితం గడపాలనుకుం టున్నాడని అర్ధమైంది. అందుకే అలాంటి ప్రకటన ఇచ్చాడని పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే తాజాగా లోకేష్ కనగరాజ్ రిటైర్మెంట్ ఆలోచన విరమించుకుంటున్నట్లు మరో ప్రకటన ఇచ్చాడు.
ఇటీవలే తమిళ నాడులో దర్శకులందరితో అసోసియేట్ అయ్యాడు. వారంతా అప్పుడే రిటైర్మెంట్ ఏంటి? ఇంకా సినిమాలు చేయాలని కోరారుట. వారిని మాటని గౌరవించి... వారి కోరికను కాదనలేక రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇది లోకేష్ అభిమానులకు శుభవార్తే. ఆయన యూనివర్శ్ నుంచి ఎన్నో సినిమాలు రావాలని..ఇక యువ సంచలనం వేగాన్ని ఎవరూ ఆపలేరంటూ అప్పుడే అభిమానులు పోస్ట్ లు కనిపిస్తున్నాయి.
లోకేష్ తాజా నిర్ణయంతో తెలుగు..హిందీలో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో సినిమాలు చేయాలని రామ్ చరణ్..ఎన్టీఆర్...బన్నీ లాంటి స్టార్లు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ తో లియో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెలలోనే రిలీజ్ కానుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నారు.