ఇదే కాస్త తగ్గించుకో లోకేషా!
ఖైది, మాస్టర్, విక్రమ్ ఈ మూడు చిత్రాలతో కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఖైది, మాస్టర్, విక్రమ్ ఈ మూడు చిత్రాలతో కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ బిల్డ్ చేసి దానిలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో మూవీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా వచ్చిన లియో మూవీ ప్రేక్షకులకి పూర్తిగా నిరుత్సాహానికి గురిచేసింది.
లోకేష్ కనగరాజ్ మూవీ అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసుకొని వెళ్ళిన ఆడియన్స్ కి లియో షాక్ ఇచ్చింది. పేలవమైన కథ, కథ, అసంపూర్తిగా ఉన్న పాత్రల చిత్రణతో లోకేష్ ఈ సినిమాని తీసాడా అనే డౌట్ వచ్చేలా మూవీ ఉంది. నిజానికి లోకేష్ బలమే కథనం. కాని లియోలో అది పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
సినిమాని తొందరగా కంప్లీట్ చేయాలనే ప్రయత్నంలో బలమైన స్క్రీన్ ప్లే రాసుకోకుండా చాపచుట్టేసినట్లు ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. అతని బ్రాండ్ కి ఉన్న గుర్తింపు కారణంగానే ఈ స్థాయిలో నిర్మాత ఇచ్చారని తెలుస్తోంది. మూవీకి 450 కోట్లకి పైగా బిజినెస్ అయ్యింది అంటే విజయ్ క్రేజ్ తో పాటుగా లోకేష్ ఇమేజ్ కలవడమే
తెలుగులో కూడా లోకేష్ బ్రాండ్ కారణంగానే స్ట్రైట్ మూవీస్ కంటే ఎక్కువ హైప్ లియో మీద ఏర్పడింది. ఓపెనింగ్స్ కూడా 15 కోట్లు వచ్చాయి. దీనిని బట్టి తెలుగు ఆడియన్స్ ఏ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లు ఓపెనింగ్ డే కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసే విధంగా లియో మూవీ ఉందని చెప్పొచ్చు.
ఇందులో సంజయ్ దత్, అర్జున్ లాంటి స్టార్ యాక్టర్స్ ని విలన్స్ గా పెట్టుకున్న బలంగా ఉపయోగించుకోలేదు. అలాగే లియోదాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ గా ఫెయిల్యూర్. ప్రియా ఆనంద్, మడోన్నా లాంటి యాక్టర్స్ ఎందుకు ఎంపిక చేసాడో కూడా క్లారిటీ లేకుండా పోయింది. నెక్స్ట్ సినిమాల విషయంలో అయిన లోకేష్ కాస్తా ఓపికగా శ్రద్ధతో నెమ్మదిగా మూవీ చేసే ప్రయత్నం చేస్తే అతని నుంచి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే సూపర్ స్టార్ మూవీ కూడా మరో లియో అయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.