సీనియ‌ర్లు చూస్తున్నా జూనియ‌ర్లు క‌రుణించ‌డంలే!

త‌మ స్టోరీకి త‌గ్గ‌ట్టు మార్కెట్ ని బేస్ చేసుకుని సినిమాలు చేసే క్ర‌మంలో సీనియ‌ర్ హీరోల‌కు పేరున్న ద‌ర్శ‌కులు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌నిపిస్తుంది.

Update: 2024-01-11 16:30 GMT

సీనియ‌ర్లు ఎదురు చూస్తున్నా! జూనియ‌ర్లు క‌రుణించ‌డం లేదు. త‌మ స్టోరీకి త‌గ్గ‌ట్టు మార్కెట్ ని బేస్ చేసుకుని సినిమాలు చేసే క్ర‌మంలో సీనియ‌ర్ హీరోల‌కు పేరున్న ద‌ర్శ‌కులు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌నిపిస్తుంది. నిజ‌మే అందులో వాస్త‌వం ఉంది క‌దా? అనిపించ‌క మాన‌దు. చిరంజీవి.. నాగార్జున‌.. వెంక‌టేష్‌..బాల‌కృష్ణ ఎంత సీనియ‌ర్ హీరోల‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ముగ్గురు ఒకేత‌రం హీరోలు.

ఆ త‌ర్వాత త‌రంలో చాలా మంది హీరోలొచ్చారు. వాళ్ల‌తో పాటు ఈ సీనియ‌ర్లు పోటీ ప‌డి సినిమాలు చేస్తున్నారు. కానీ జూనియ‌ర్ హీరోల‌తో ప‌నిచేస్తోన్న పేరున్న కొంద‌రు ద‌ర్శ‌కులు మాత్రం సీనియ‌ర్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. రాజ‌మౌళి కొంత కాలంగా కేవ‌లం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఆ రేంజ్ హీరోలు ఎవ‌రు ఉన్నారో చూసుకుని సినిమాలు చేస్తున్నారు.

ఒక్కో సినిమాతో వేల కోట్లు వ‌సూళ్లు రాబ‌డుతున్నారు. ఇక త్రివిక్ర‌మ్ ఇంకా పాన్ ఇండియా జోలికి వెళ్ల‌లేదు. తెలుగు ప్రేక్ష‌కుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న క‌థ‌ల‌న్ని నేటి జ‌న‌రేష‌న్ హీరోల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ హీరోల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ డైరెక్ట్ చేస్తున్నారు త‌ప్ప‌! సీనియ‌ర్ల గురించి ఆలోచించ డం లేదు. అలాగే సుకుమార్ కూడా నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తోనే సినిమాలు చేస్తున్నారు.

ఎంత సేపు రామ్ చ‌ర‌ణ్‌..బ‌న్నీ..ఎన్టీఆర్ అంటున్నారు త‌ప్ప సీనియ‌ర్ల గురించి ఆలోచించ‌డం లేదు. ఇంకా పాన్ ఇండియాలో స‌క్స‌స్ అయిన మరికొంత మంది మేక‌ర్స్ కూడా ఇండియా మార్కెట్ ని దృష్టి లో పెట్టు కుంటున్నారు త‌ప్ప‌! సీనియ‌ర్ల‌తో ఆస‌క్తి చూపించ‌డం లేదు. దీంతో సీనియ‌ర్లు కాస్త వెనుకుబ‌డుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రీ పూర్తిగా వెనుక‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌నుకోండి. ఇప్ప‌టికే యంగ్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు.

Tags:    

Similar News