ఆ టైటిల్ పై వివాదం తప్పదా!
క్యాచీగా ఉంటుందని చిత్ర దర్శకుడు నిర్ణయించినా ఆ టైటిల్ యువతలో చెడుగా వెళ్లే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో సైతం చర్చ నడుస్తోంది.
టైటిల్స్ పై వివాదాలు కొత్తేంకాదు. స్టార్ హీరోలంతా అప్పుడప్పుడు టైటిల్ వివాదాలు ఎదుర్కుంటూనే ఉంటారు. ఈ వివాదం సరిగ్గా రిలీజ్ సమయంలో జరుగుతుంది. అంతవరకూ సైలెంట్ గా ఉన్న సంఘా లన్నీ రిలీజ్ సమయం దగ్గరపడేసరికి ముందుకొస్తాయి. ఆ తర్వాత నెట్టింట నానా రచ్చ జరుగు తుంటుంది. తాజాగా మరో తెలుగు సినిమా టైటిల్ కి వివాదం తప్పలా లేదని వినిపిస్తోంది.
ఇటీవలే ఓ యంగ్ హీరో తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. నిజానికి ఆ టైటిల్ కూడా వివాదాస్ప దంగా నే కనిపిస్తుంది. క్యాచీగా ఉంటుందని చిత్ర దర్శకుడు నిర్ణయించినా ఆ టైటిల్ యువతలో చెడుగా వెళ్లే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో సైతం చర్చ నడుస్తోంది. గతంలో పలు సినిమాల టైటిళ్ల పై వివాదాలు తలెత్తిన పరిస్థితిని గుర్తు చేస్తూ ఈ సినిమాకి ఆ తిప్పలు తప్పవంటున్నారు.
ఇప్పటికే చాలా మంది యువత మద్యం..సిగరెట్టు వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని ప్రభుత్వాలు అవేర్ నెస్ కార్యక్రమాలు కూడా పెంచాయి. ఈ నేపథ్యంలో యువతపై సినిమాల ప్రభావం కూడా తీవ్రంగా ఉందని కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఓ సినిమా టైటిల్ మత్తు అనే పదార్దంతో ముడి పడి ఉంటుంతో యువతని ఎక్కువగా కర్షించే అవకాశం ఉందని వినిపిస్తుంది.
సరిగ్గా రిలీజ్ సమయంలో ఆసినిమా టైటిల్ వివాదం ఎదుర్కుంటుందని... ఈ విషయంలో కొన్ని పేరున్న సంస్థలు కూడా టైటిల్ ని ఖండిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముందున్న రెండు అక్షరాల్ని తొలగించి రిలీజ్ చేసేలా ఒత్తిడి తెస్తారని వినిపిస్తుంది. సినిమా కి ముందు మద్యం..సిగరెట్లు మానేయాలని కొటేషన్లు ఇచ్చే హీరోలు... సినిమాలకి అలాంటి టైటిల్స్ పైట్టడం వెనుక ఆతర్యం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లా హీరోలు ఆలోంచించాలని...యువత చెడు దోవ పట్టకుండా వీలైనంత వరకూ ఏదో ఒక సందేశం సినిమాలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇదంతా జరిగే పనేనా ? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి.