దివి.. హార్డ్ వర్క్ లో హై గ్లామర్ ట్రీట్

ఇటీవల బ్లాక్ మినీ డ్రెస్ లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

Update: 2024-09-05 04:36 GMT

అందాల దివి ఎప్పటికప్పుడు తన అందంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత క్రేజ్ మరింత పెరిగింది. ఈ షోలో ఆమె పోషించిన రోల్, అందంతో పాటు ఆమె అల్లరి, నిజాయితీ అభిమానులను బాగా ఆకర్షించింది. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోకపోయినా, దివి మనసులు గెలిచింది. షో ముగిసిన వెంటనే ఆమెకు అనేక అవకాశాలు వస్తున్నాయి, ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు.

 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి, తెలుగు సినిమాల్లో పలు రోల్స్‌లో కనిపించింది. "మహర్షి" సినిమాలో ఆమె చేసిన చిన్న రోల్ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత దివి "ఏ1 ఎక్స్‌ప్రెస్" వంటి చిత్రాల్లో నటించి తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అదేవిధంగా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన "గాడ్ ఫాదర్" చిత్రంలో కూడా దివి చిన్న పాత్ర పోషించింది.

 

ఇక తాజాగా, దివి "లంబసింగి" అనే సినిమాలో ప్రధాన కథానాయికగా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా కానీ, దివి నటన పట్ల అందరూ ప్రశంసలు కురిపించారు. అలాగే, మరో క్రేజీ ప్రాజెక్ట్ "పుష్ప 2"లో కీలక పాత్రలో దివి కనిపించనుంది. ఈ సినిమా గ్లింప్స్ లో ఇప్పటికే ఆమె లుక్ ఆకట్టుకుంది.

 

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న "NBK 109"లో కూడా దివి మంచి రోల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, దివి తన ఫిట్‌నెస్, గ్లామర్ పట్ల కూడా ఎంతో శ్రద్ధ చూపిస్తోంది. రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తన ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తోంది.

ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా తన వర్కౌట్ ఫోటోలను, గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇటీవల బ్లాక్ మినీ డ్రెస్ లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమె ఫిజిక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

వర్కౌట్స్ తో ఫిట్‌గా, గ్లామరస్‌గా ఉండే దివి, ఎప్పటికప్పుడు తన అభిమానులను తన అందంతో అలరిస్తోంది. దివి ప్రస్తుత సినిమాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక దివి కెరీర్ ఫ్లో ఎలా ఉంటుందో చూడాలి, కానీ ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్, గ్లామర్ మేనేజ్‌మెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News