మిడిల్ క్లాస్ నటికి 10వేల కోట్ల ఆస్తులు?
ఈ జాక్ పాట్ ఎలా? ఇదెలా సాధ్యమైంది? అంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయి. నటి కావాలని కలలు కంది. నటనా ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆరంభం ఒక తెలుగు సినిమాలో నటించింది. అటుపై హిందీ చిత్రసీమలో నటించింది. సినిమాల్లో నటి కాక ముందే పలు ఆల్బమ్స్‌లోను నటించింది. అయితే నటనలో కొనసాగుతుండగానే సడెన్ గా 10,000 కోట్ల ఆస్తిలో ఒక భాగస్వామి అయింది. ఈ జాక్ పాట్ ఎలా? ఇదెలా సాధ్యమైంది? అంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
అందరిలానే కోటి కలలతో సినీరంగంలో నటిగా అడుగుపెట్టింది దివ్య ఖోస్లా. ఆరంభం ఉదయ్ కిరణ్ లవ్ టుడే చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ సినిమా మంచి రిజల్ట్‌నే అందుకుంది. అటుపై హిందీలో ఓ చిత్రంలో నటించింది. కానీ అది డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమా సెట్లో దివ్యను చూసి ప్రేమలో పడిపోయాడు టిసిరీస్ అధినేత భూషణ్ కుమార్. అటుపై ఇరు కుటుంబాల్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు.
భూషణ్ కుమార్ & దివ్య ఖోస్లా 19 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న పవర్ కపుల్. నిర్మాతను పెళ్లాడాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు దివ్యకు కేవలం 18 ఏళ్లు. అప్పటి నుండి వారి మధ్య సయోధ్య బలంగా ఉంది. టీసిరీస్ అధినేత భార్యగా వేల కోట్ల ఆస్తులను అనుభవిస్తోంది. ఇటీవల దివ్య తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుండి తన ఇంటిపేరు కుమార్‌ని తొలగించిన తర్వాత ఈ జంట విడిపోయే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని వారి తరపున ప్రతినిధి కొట్టిపారేశారు.
దివ్య ఖోస్లా తన జ్యోతిష్య విశ్వాసాల కారణంగా తన ఇంటి పేరును వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దివ్య ఖోస్లా నికర ఆస్తి విలువ ఎంత ఉంది? అన్నది ఆరా తీస్తే... 2004లో `అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో`తో దివ్య బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. 2005లో భూషణ్‌ను వివాహం చేసుకుంది. ఆమె T-సిరీస్ మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించింది. 2014లో యారియాన్‌తో దర్శకురాలిగా తన సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత దివ్య సినిమాలకు దర్శకత్వం వహిస్తోంది. ఈ భామ నికర ఆస్తి విలువ దాదాపు 42 కోట్లు. అయితే కొన్ని వెబ్ సైట్లలో ఈ విలువ దాదాపు 206 కోట్లు ఉంటుందని అంచనా వెలువరించాయి.
భూషణ్ కుమార్ నికర ఆస్తి విలువ:
అయితే దివ్య ఖోస్లా భర్త భూషణ్ కుమార్ నికర ఆస్తుల గురించిన వివరాలు కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. దైనిక్ భాస్కర్ పత్రికలో అతడి నికర ఆస్తి విలువ 4500 కోట్లుగా ప్రచురించగా, మనీ మింట్ దాదాపు 1000 కోట్లుగా అంచనా వేసింది! నిర్మాతగా టీసిరీస్ అధినేత భారీ ఆస్తులను కూడగట్టారన్న టాక్ ఉంది.
భూషణ్ కుమార్ కుటుంబ నికర ఆస్తులు:
హురున్ జాబితా 2022 ప్రకారం.. సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీ (టి-సిరీస్) యజమానిగా ఉన్న భూషణ్ కుమార్ కుటుంబం దాదాపు 10,000 కోట్ల నికర ఆస్తి విలువను కలిగి ఉంది! ఈ ఉమ్మడి ఆస్తులలో దివ్య ఖోస్లా 0.45 శాతం మాత్రమే ఆస్తిని సొంతంగా కలిగి ఉన్నారు. వ్యక్తిగతంగా భూషణ్ నికర ఆస్తి విలువ కేవలం 50 మిలియన్ డాలర్లు, అంటే 414 కోట్లు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
భూషణ్ కుమార్ - దివ్య ఖోస్లా 2020లో జుహులో 167 కోట్లు వెచ్చించి కొత్త బంగ్లాను కొనుగోలు చేశారు! ఈ ఆస్తికి 9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. బంగ్లా నాలుగు అంతస్తులు, ఐదు మాస్టర్ బెడ్‌రూమ్‌లు, ఒక పెంట్‌హౌస్, జిమ్, మందిర్ .. డైనింగ్ ఏరియాను కలిగి ఉంది. ఈ కుటుంబం ఢిల్లీలో గ్రేటర్ కైలాష్‌లో 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్వీకుల ఇంటిని కలిగి ఉంది. ఈ ఇంటిని భూషణ్ తండ్రి గారైన గుల్షన్ కుమార్ కొనుగోలు చేశారు. తాజా సమాచారం మేరకు.. కేవలం T-సిరీస్ విలువ దాదాపు 4100 కోట్లు.
భూషణ్- దివ్య లగ్జరీ లైఫ్ స్టైల్ నిరంతరం చర్చనీయాంశం. రోల్స్-రాయిస్ కల్లినాన్ ఈ జంట సొంతం. దీని ధర 8 కోట్లు. ఫెరారీ 458 ఇటాలియా ధర 4 కోట్లు... ఆడి R8 స్పైడర్ విలువ 3 కోట్లు.. 3 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ S500. నిర్మాత భూషణ్ లగ్జరీ వస్తువులను బహుమతిగా ఇవ్వడానికి ఇష్టపడతారు. భూల్ భూలయ్యా 2 విజయవంతమైన తర్వాత అతడు కార్తీక్ ఆర్యన్‌కి 4 కోట్ల విలువైన మెక్‌లారెన్ GTని బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌కి 4.02 కోట్ల విలువైన బీస్ట్ కార్ ని బహుమతిగా ఇచ్చాడు.