డబుల్ ఇస్మార్ట్.. అసలు టార్గెట్ ఫినిష్!

ఇక ఇటీవల గ్యాప్ లేకుండా షూటింగ్ లో వేగాన్ని పెంచిన పూరి గ్యాంగ్ మరో బలమైన టార్గెట్ ను ఫినిష్ చేసుకుంది. ఇ షూటింగ్ పనులను మొత్తానికి అనుకున్న సమయానికి ఫినిష్ చేశారు.

Update: 2024-07-05 07:07 GMT

ఉస్తాద్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ గత కొన్ని రోజులుగా శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను ఇదే ఏడాది మర్చి లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఆ మధ్య కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు.

 

ఇక ఇప్పుడు ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్యే మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు, 'స్టెప్పా మార్' అనే మాస్ సాంగ్ తో ఆడియో ప్రమోషన్స్ కు శుభారంభం చేశారు. ఈ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ పాటతో అభిమానులను ఉర్రూతలూగించిన మేకర్స్, ఆడియో ప్రమోషన్స్ ను మరింత వేగంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఇటీవల గ్యాప్ లేకుండా షూటింగ్ లో వేగాన్ని పెంచిన పూరి గ్యాంగ్ మరో బలమైన టార్గెట్ ను ఫినిష్ చేసుకుంది. ఇ షూటింగ్ పనులను మొత్తానికి అనుకున్న సమయానికి ఫినిష్ చేశారు. పక్కా ప్రణాళికతో అనుకున్న అవుట్ పూట్ ను ప్రేక్షకులకు అందించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

'డబుల్ ఇస్మార్ట్' పాన్-ఇండియన్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా హైప్ తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్ గా వస్తోంది. పూరి జగన్నాథ్ మరియు చార్మి కౌర్ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రామ్ సరసన కవ్యా థాపర్ కథానాయికగా కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని సామ్ కె. నాయుడు మరియు జియాని జియానెల్లి నిర్వహించారు.

Read more!

సంగీతాన్ని మణి శర్మ అందించారు. ఈ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ లో రామ్ పోతినేని ఒక పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కాంబినేషన్ కి మరో సూపర్ హిట్ అనిపించుకునేలా ఉంది. మరి విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News

eac