అదితీరావ్ హైద‌రీ మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా?

ఆ త‌ర్వాత కేవ‌లం నిశ్చితార్థం మాత్ర‌మే అయింద‌ని సిద్ధార్థ్ వెల్ల‌డించాడు.

Update: 2024-03-29 05:16 GMT

అందాల క‌థానాయిక అదితీరావ్ హైదరీ - హీరో సిద్ధార్థ్ బుధవారం (మార్చి 27) తెలంగాణలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నార‌ని మీడియాలో ప్ర‌చార‌మైంది. అయితే వీరిద్దరు పెళ్లి వార్తలను ధృవీకరించలేదు. ఆ త‌ర్వాత కేవ‌లం నిశ్చితార్థం మాత్ర‌మే అయింద‌ని సిద్ధార్థ్ వెల్ల‌డించాడు.

ఈ పుకార్ల అనంత‌రం అదితీరావ్, సిద్ధార్థ్ మునుప‌టి పెళ్లి వ్య‌వ‌హారంపై నెటిజ‌నుల్లో సెర్చ్ మొద‌లైంది. సిద్ధార్థ్ కంటే ముందు అదితీరావ్ హైద‌రీ తన 21వ ఏట సత్యదీప్ అనే యువ‌కుడిని పెళ్లాడింది. చివరికి అత‌డి నుండి విడిపోయింది. అనంత‌రం ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. అతడు ఇప్పుడు ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు.

2013లో సత్యదీప్ మిశ్రాతో తన వివాహం గురించి వచ్చిన వార్తలపై వ్యాఖ్యానించడానికి అదితి రావ్ హైదరీ నిరాకరించినప్పటికీ చివరకు తాము విడిపోయామని వెల్లడించింది. 2007 సంవత్సరంలో అదితీ 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. వారు 17 సంవత్సరాల వయస్సులో పాఠశాలలో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. అక్క‌డే డేటింగ్ మొద‌లైంది. అనంత‌రం పెళ్లాడారు. కానీ ఈ పెళ్లి నిల‌బ‌డ‌లేదు.

గతంలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి మొదటిసారిగా మాజీ భర్త సత్యదీప్‌తో విడాకుల గురించి మాట్లాడింది. అది ఒక్క‌టే తన సీరియ‌స్ రిలేష‌న్‌షిప్ అని వెల్ల‌డించింది. అదితీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ-``అవును, నేను సివిల్ సర్వెంట్.. లాయర్ అయిన సత్యదీప్‌ని 21వ ఏట వివాహం చేసుకున్నాను. ఆ త‌ర్వాత న‌టిగా మారడానికి ఆ పెళ్లిని వదులుకున్నాను. అతడు సహజ నటుడు.. ప‌లు చిత్రాల్లో న‌టించాడు. నేను అతడిని 17 సంవత్సరాల వయస్సులో కలిశాను. అది నా సీరియ‌స్ రిలేష‌న్ షిప్‌`` అని అతిదీ వ్యాఖ్యానించింది.

క‌ల‌తలు రావ‌డంతో చివ‌రికి ఈ జంట‌ స్నేహితులుగా ఉండటం మంచిదని గ్రహించారు. విడిపోవడం గురించి మాట్లాడుతూ అదితీ ఇలా అన్నారు. ``మేము విడిపోయినప్పుడు నా గుండె బ‌ద్ద‌లైంది. కానీ మేం స్నేహితులం. ఇప్పటికీ సన్నిహితుల‌మే కానీ.. మా సంబంధం పేరు మాత్రమే కుప్పకూలింది. తన తల్లికి, నేను కుమార్తెని.. నా తల్లికి అతను కొడుకు. అతను నాకంటే చాలా పెద్దవాడు. అతడు వదిలించుకోలేని త‌న‌ బిడ్డ అని నన్ను ఎప్పుడూ ఆటపట్టించేవాడు... అని అదితీ అన్నారు.

నేను గతంలో బ్రేక‌ప్ గురించి మాట్లాడలేదు.. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడకూడదనుకోవ‌డానికి కారణం ఉంది. ఏదో ఒకవిధంగా నేను ఏ కుటుంబం నుండి వచ్చాను.. నేను ఎక్కడ పెరిగాను అనే కోణంలో వ్యక్తిగత విషయాలను చర్చించడం నటుల‌కు అంత‌ ముఖ్యం కాదు. మనం పారదర్శకంగా ఉండాలి. మనకు ఏది ఇచ్చినా మనం స్వీకరించాలి. బ్రేక‌ప్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా మా వ్యక్తిగత జీవితం బహిరంగంగానే ఉంటుంది`` అని అదితీ అన్నారు. స‌త్య‌దీప్ మిశ్రా చాలా సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టించారు.

Tags:    

Similar News