టాలీవుడ్ కి దొరికిన మలయాళ'మణి'..!

సినిమా ప్రేమికులైన తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమా ఏ భాషలో తెరకెక్కినా సరే దాన్ని డబ్ చేస్తే చాలు చూస్తారు.

Update: 2024-11-04 05:42 GMT

సినిమా ప్రేమికులైన తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమా ఏ భాషలో తెరకెక్కినా సరే దాన్ని డబ్ చేస్తే చాలు చూస్తారు. జోనర్ ఏదైనా హీరో ఎవరైనా సరే సినిమాలో కంటెంట్ ఉంది అంటే సూపర్ హిట్ చేస్తారు. ఇతర భాషా హీరోలకు కూడా ఇక్కడ మంచి క్రేజ్ ఉంది. వారి సినిమాలు రిలీజ్ అవ్వడమే ఆలస్యం మన స్టార్స్ కి ఈక్వల్ రేంజ్ వసూళ్లను వచ్చేలా చేస్తారు. ఐతే మలయాళ స్టార్ దుల్కర్ మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడ సూపర్ హిట్లు కొడుతున్నాడు.

మలయాళంలో కథానాయికలు తెలుగు పరిశ్రమకు రావడం కామనే కానీ అక్కడ నుంచి హీరో టాలీవుడ్ కి వచ్చి సూపర్ సక్సెస్ లు కొడుతున్నాడు. మహానటితో మొదలైన దుల్కర్ తెలుగు సినిమా ప్రస్థానం సీతారామం తో కొనసాగించగా లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తో మరో సక్సెస్ చేరింది. అతను ఎంచుకున్న కథలు అలా సూపర్ హిట్లు ఇస్తాయో లేదో అలా హిట్లు పడే కథలను దుల్కర్ ఎంపిక చేసుకుంటాడో ఏమో కానీ మలయాళంలో హిట్లు ఫ్లాపుల మధ్య సాగుతున్న దుల్కర్ కెరీర్ ని తెలుగు సినిమాలు మాత్రం స్టార్ రేంజ్ కి తీసుకెళ్తున్నాయి.

లక్కీ భాస్కర్ విజయం తెలుగు ఆడియన్స్ తనను ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నై మరోసారి ప్రూవ్ అయ్యింది. అందుకే మలయాళంతో పాటు తెలుగు సినిమాను కూడా తన స్పెషల్ ఇంట్రెస్ట్ గా పెట్టుకున్నాడు. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో మాహనటి టైం లో తెలుగు సినిమా చేయాలంటే కంగారు అనిపించినా నాగ్ అశ్విన్ పర్లేదని ధైర్యం ఇవ్వడం వల్లే చేశానని చెప్పిన దుల్కర్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ వాటితో సూపర్ హిట్లు కొడుతున్నాడు.

దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ తో తన రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రానాతో కలిసి మరో క్రేజీ మూవీ చేస్తున్నాడు దుల్కర్. ఇక హిట్లు పడుతున్నాయి కదా అని తన రెమ్యునరేషన్ కూడా పెంచాడట దుల్కర్. తెలుగు నిర్మాతలు దుల్కర్ తో మరిన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దుల్కర్ తో ఎలాంటి ప్రయోగమైనా చేయొచ్చు అంతేకాఉ అతని సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దుల్కర్ తో సినిమా అది ఎంతైనా పర్లేదు అనేస్తున్నారు.

సో ఇలా చూస్తే టాలీవుడ్ కి దొరికిన మలయాళ మణిగా దుల్కర్ సల్మాన్ ని చెప్పుకోవచ్చు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఈ మూడు సినిమాల హిట్ తో మరోసారి తన సత్తా ఏంటన్నది చూపించాడు దుల్కర్. తప్పకుండా రాబోయే సినిమాలతో కూడా దుల్కర్ ఈ ఇంప్యాక్ట్ ని కొనసాగిస్తారని చెప్పొచ్చు.

Tags:    

Similar News