టాలీవుడ్ స్టార్స్ తో మల్టీస్టారర్.. దుల్కర్ ఏమన్నారంటే..

దుల్కర్ సల్మాన్ ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Update: 2024-10-27 10:03 GMT

'మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో టాలీవుడ్ లో రెండు సక్సెస్ లు అందుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ తో హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలలో తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని దుల్కర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తో మూవీ అంటే వెంటనే ఒకే చెప్పేస్తానని అన్నారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను. వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. టాలీవుడ్ లో నాని, రానా మంచి ఫ్రెండ్స్ వారితో కలిసి వర్క్ చేయాలనుంది. వీళ్ళలో ఎవరితో అయిన మల్టీ స్టారర్ మూవీ చేయడానికి నేను సిద్ధమే.

అయితే చాలా మంది మంచి యాక్షన్ మూవీ చేయమని అడుగుతున్నారు. మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ సిద్ధం చేస్తే ఇతర హీరోలతో కలిసి చేయడానికి రెడీగా ఉన్నానని దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దుల్కర్ రానాతో కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని రానా, దుల్కర్ కలిసి నిర్మించడంతో లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

‘లక్కీ భాస్కర్’ మూవీ రిలీజ్ తర్వాత దుల్కర్ ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ తో ఉన్న అనుబంధం కొద్ది ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో నటించానని దుల్కర్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ‘కల్కి పార్ట్ 2’ లో ఉంటానా లేదా అనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్ణయం, అతను రాసుకున్న స్క్రిప్ట్ బట్టి ఉంటుందని స్పష్టం చేశారు.

‘లక్కీ భాస్కర్’ తో దుల్కర్ సక్సెస్ అందుకుంటే టాలీవుడ్ లో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సెలక్టివ్ గా డిఫరెంట్ కథలతో మూవీస్ చేస్తోన్న దుల్కర్ కి మాతృభాష మలయాళంలో కంటే తెలుగులోనే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News