దుల్కర్ సల్మాన్.. ఆకాశంలో ఒక తార

అందుకే టాలీవుడ్ దర్శకులు క్లాసిక్ అండ్ డ్రామా మిక్స్ చేసిన కథల కోసం దుల్కర్ సల్మాన్ ని బెస్ట్ ఛాయస్ గా అనుకుంటున్నారు.

Update: 2024-07-28 06:51 GMT

మలయాళీ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ కి సీతారామం సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ గా ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నాడు. అందుకే టాలీవుడ్ దర్శకులు క్లాసిక్ అండ్ డ్రామా మిక్స్ చేసిన కథల కోసం దుల్కర్ సల్మాన్ ని బెస్ట్ ఛాయస్ గా అనుకుంటున్నారు.


సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో పాన్ ఇండియా మూవీగా లక్కీ భాస్కర్ చేస్తున్నారు. వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త సినిమా దుల్కర్ సల్మాన్ నుంచి రాబోతోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం చేయబోతున్నాడు.

"ఆకాశంలో ఒక తార" అనే టైటిల్ తో తాజాగా మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రమ్య గుణ్ణం, సందీప్ గుణ్ణం ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సాధినేని చివరిగా సేనాపతి అనే సినిమాని చేశారు. అలాగే డిజిటల్ మీడియాలో గత ఏడాది దయ అనే వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్నారు.

మరల దర్శకుడిగా బిగ్ స్క్రీన్ పై హార్ట్ టచింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి పవన్ సాధినేని రెడీ అవుతున్నాడు. తాజాగా లాంచ్ చేసిన పోస్టర్ లో రైతు గెటప్ లో దుల్కర్ సల్మాన్ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో మేఘాలు. ఎండిన పంట పొలాల మధ్యలో స్కూల్ బ్యాక్, యూనిఫామ్ వేసుకొని ఉన్న ఓ చిన్నారిని రిప్రజెంట్ చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ బట్టి తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.

అలాగే పల్లెటూరు, వ్యవసాయం నేపథ్యంలో కథని పవన్ సాధినేని చెప్పబోతున్నారు అని పోస్టర్ రివీల్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్ కెరియర్ లో భిన్నమైన క్యారెక్టర్ ని ఈ చిత్రంలో చేస్తున్నాడని అనిపిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. అలాగే తెలుగుతో పాటు తమిళ్, మలయాళీ, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ కానుందని పోస్టర్ లో రివీల్ చేశారు.

Tags:    

Similar News