డంకీ' బాక్సాఫీస్.. ఈ మాత్రం సరిపోద్దా?

బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారుక్ తో చేసిన ప్రయోగం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Update: 2023-12-26 16:39 GMT

బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండుసార్లు వెయ్యి కోట్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక తాజాగా విడుదలైన 'డంకీ' తో హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అది జస్ట్ అయింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారుక్ తో చేసిన ప్రయోగం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకి మొదటి రోజే డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద 'డంకీ' పూర్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

డంకి సినిమాకి ఆశించిన టాక్ రావడానికి కారణం ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడమే అని అంటున్నారు. సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని, పైగా రాజ్ కుమార్ హిరాని గత చిత్రాలతో పోల్చితే 'డంకీ' అంత బాలేదనే వాదనలు వినిపించాయి. సినిమాలో షారుక్ ఖాన్ పర్ఫామెన్స్ బాగున్నా ఎమోషన్ పెద్దగా కనెక్ట్ కాకపోవడమే సినిమాకి అతిపెద్ద మైనస్ అని క్రిటిక్స్ చెప్తున్నారు.

పఠాన్, జవాన్ సినిమాలతో పోల్చుకుంటే 'డంకీ' కి మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత రెండో రోజు నుంచి మెల్లగా కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించింది. వీకెండ్ తో పాటు క్రిస్మస్ హాలిడే కావడంతో క్రిస్మస్ అడ్వాంటేజ్ తో ఐదు రోజుల్లో భారీ కలెక్షన్స్ అందుకుంది. నాలుగో రోజున ఈ మూవీ సుమారు రూ.23 నుంచి రూ.24 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా మొత్తం నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా రూ.156 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక ఐదో రోజు ఓవర్సీస్ లో సుమారు రూ.93 కోట్ల గ్రాస్ అందుకని ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.250 కోట్ల వసూళ్లను అందుకుంది. వీకెండ్ పూర్తయ్యే లోపు ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. కాగా డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వాలంటే మరో రూ.300 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.

నిజానికి ఇవి షారుక్ ఖాన్ రేంజ్ కలెక్షన్స్ అయితే కాదు.అయినా కూడా సినిమాకి డివైడ్ టాక్ ఉన్నా రూ.30 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో స్టడీ కలెక్షన్స్ ని మెయింటెన్ చేస్తుండడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్‌, అనిల్ గ్రోవర్‌ కీ కీలకపాత్రలు పోషించారు.

Tags:    

Similar News