'డంకీ' బాక్సాఫీస్.. మొదటి రోజే మైండ్ బ్లాక్

అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా షారుక్ లేటెస్ట్ మూవీ 'డంకి' ని కాపాడలేకపోయాయి

Update: 2023-12-22 10:04 GMT

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస ప్లాప్స్ తర్వాత ఈ ఏడాది భారీ కం బ్యాక్ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షారుక్ ఈ ఇయర్ పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. పఠాన్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే జవాన్ అంతకుమించి 1150 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లోనే ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా షారుక్ ఖాన్ క్రేజ్ ని పది రెట్లు పెంచేసాయి.

అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా షారుక్ లేటెస్ట్ మూవీ 'డంకి' ని కాపాడలేకపోయాయి. షారుక్ ఖాన్ ఇమేజ్, రాజ్ కుమార్ హిరాని బ్రాండ్ తో డిసెంబర్ 21న ప్రేక్షకులు ముందుకు వచ్చిన 'డంకీ' మూవీ కొన్నిచోట్ల నెగిటివ్ టాక్ ని మరికొన్ని చోట్ల డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన డంకీ సినిమా డే వన్ కలెక్షన్స్ రూ.30 కోట్లుగా ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఇదే నిజమైతే షారుఖ్ ఖాన్ ఇమేజ్ కూడా డంకీని కాపాడలేకపోయిందనే చెప్పారు. ఎందుకంటే జవాన్ తో 100 కోట్ల ఓపెనింగ్, పఠాన్ తో 90 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన షారుక్ డంకీ తో కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం నిజంగా బాధాకరం. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువగానే ఉంది కాబట్టి త్వరలో ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.

పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుక్ డంకి మూవీతో హ్యాట్రిక్ ని మిస్ అయ్యాడు. మొత్తంగా పఠాన్, జవాన్ వంటి మాస్ కమర్షియల్ సినిమాల ముందు డంకి లాంటి క్లాస్ సినిమా నిలబడలేకపోయింది. మరోవైపు డంకి సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడమే అని అంటున్నారు.

సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని, పైగా రాజ్ కుమార్ హిరాని గత చిత్రాలతో పోల్చితే 'డంకీ' అంత గొప్ప సినిమా కాదని తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు. సినిమాలో షారుక్ ఖాన్ పర్ఫామెన్స్ బాగున్నా ఎమోషన్ పెద్దగా కనెక్ట్ కాకపోవడమే సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెబుతున్నారు. మరి ముందు ముందు డాంకీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి

Tags:    

Similar News