డంకీ డ్రాప్ 4: ఒక మిషన్ కోసం గతంలోకి వెళ్లే వృద్ధుడి కథ?
డంకీ నలుగురు స్నేహితుల హృదయాన్ని కదిలించే కథ.. విదేశీ తీరాలను చేరుకోవాలనే వారి తపన.. కలలను నిజం చేసుకోవడానికి కష్టతరమైన జీవిత మలుపుల ప్రయాణానికి సంబంధించిన కథతో రూపొందింది.
షారూఖ్ ఖాన్‌తో రాజ్‌కుమార్ హిరానీ తొలిసారిగా కలిసి నటించిన డుంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాల్లో విడుదల కానుంది. టీజర్ - రెండు పాటలను విడుదల చేసిన తర్వాత, మంగళవారం డుంకీ ట్రైలర్‌ను డ్రాప్ 4 పేరుతో ఆవిష్కరించారు. షారూఖ్ ఖాన్ - దర్శకనిర్మాత రాజ్‌కుమార్ హిరాణీల కలయికలో ఇది మొదటి సినిమా కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
డంకీ నలుగురు స్నేహితుల హృదయాన్ని కదిలించే కథ.. విదేశీ తీరాలను చేరుకోవాలనే వారి తపన.. కలలను నిజం చేసుకోవడానికి కష్టతరమైన జీవిత మలుపుల ప్రయాణానికి సంబంధించిన కథతో రూపొందింది. నిజ జీవిత అనుభవాల నుండి తీసిన చిత్రమిది. డంకీ అనేది ప్రేమ స్నేహం నేపథ్యంలో సాగే ఆసక్తికర సినిమా. ఇది వైవిధ్యమైన భిన్నమైన కథలను ఒకచోట చేర్చిన కథాంశం.
ట్రైలర్ ఆద్యంతం వార పోరాటాలు ప్రయత్నాల గురించిన ఉద్విగ్నతతో కూడుకున్న అంశాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో ఒక మిషన్ కోసం భవిష్యత్ లేదా గతంలోకి వెళ్లే వృద్ధుడి కథను హిరాణీ చూపిస్తున్నారని హింట్ అందింది. ఈ సినిమాకి బహుశా ఇదే యు.ఎస్.పి కావచ్చు. ట్రైలర్ డ్రాప్ 4లో షారూఖ్ వృద్ధ గెటప్ .. యువకుడిగా ఉన్నప్పటి గెటప్ ఇవన్నీ సర్ ప్రైజ్ ప్యాకేజీ అని చెప్పాలి.
ఈ ఏడాది షారుఖ్‌కి డుంకీ మూడో సినిమా. పఠాన్ -జవాన్ చిత్రాలలో తన యాక్షన్-ప్యాక్డ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ ,రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్ నిర్మించిన డుంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాల్లో విడుదల కానుంది. డుంకీలో సమిష్టి తారాగణం ప్రధాన అస్సెట్. షారుఖ్ ఖాన్‌తో పాటు ప్రతిభావంతులైన నటులు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.