డంకీ తెలుగులో రావడం లేదా?
కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతోందంటూ తొలి నుంచి ప్రచారం ఉంది. ఇంతకుముందు హిందీ మీడియాలు దీనిపై చాలా ఊదరగొట్టాయి.
కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతోందంటూ తొలి నుంచి ప్రచారం ఉంది. ఇంతకుముందు హిందీ మీడియాలు దీనిపై చాలా ఊదరగొట్టాయి. జవాన్ - పఠాన్ చిత్రాలతో పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్లు అందుకున్న కింగ్ ఖాన్ డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని కలలుగంటున్నారని ప్రచారమైంది. డంకీని ఉత్తరాదితో పాటు, దక్షిణాదినా భారీగా రిలీజ్ చేయనున్నారని కూడా ప్రచారమైంది.
కానీ ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజవుతుందా లేదా? అన్నది ఇప్పుడు సందిగ్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ గురించి కానీ తమిళ వెర్షన్ గురించి కానీ అంతగా ప్రచారం లేదు. ప్రత్యేకించి తెలుగు వెర్షన్ పై దృష్టి సారిస్తున్న వైనం కనిపించలేదు. ఇంతకుముందు జవాన్- పఠాన్ చిత్రాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెలుగులోకి అనువదించి రిలీజ్ చేసారు. కానీ ఈసారి డంకీ విషయంలో అనువాదం వస్తుందా రాదా? అన్నదానిపై స్పష్ఠత రాలేదు.
అయితే డంకీ విషయంలో రాజ్ కుమార్ హిరాణీ ధోరణి వేరుగా ఉందిట. ఇది కేవలం అర్బన్ నేటివ్ సినిమా. క్లాస్ జనాలు మాత్రమే థియేటర్లకు వస్తారు. మాస్ ని థియేటర్లకు రప్పించే సినిమా ఇది కాదని తొలి నుంచి ప్రచారం సాగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లు కూడా దీనిని ధృవీకరించాయి. ఇది క్లాస్ సినిమా.. మాస్ కి ఎక్కదు అన్న క్లారిటీ వచ్చేసింది. డంకీ డ్రాప్ 4 కి యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కాయని ప్రచారం చేస్తున్నా ఆ ట్రైలర్ లో అంత మ్యాటర్ ఏదీ కనిపించలేదన్న చర్చా సాగుతోంది.
సలార్‌కి బిగ్ ప్లస్:
'డంకీ' విషయంలో పాన్ ఇండియా రిలీజ్‌ని దాట వేయొచ్చు అన్న అంచనాలేర్పడ్డాయి. ఒకవేళ ఇదే జరిగితే ఈనెలలో ఒక రోజు గ్యాప్ తో 'సలార్'తో పోటీపడుతున్న డంకీ రేసులో వెనక్కి తగ్గినట్టే అవుతుంది. సలార్ కి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వైపుల నుంచి డిమాండ్ ఉంటుంది. ప్రీబుకింగుల్లోను సలార్ దూకుడు కనిపిస్తోంది. అంటే ప్రభాస్ సలార్ క్రిస్మస్ రేసులో భారీ ఓపెనింగులను సాధించడం ఖాయం. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదినా ఈ చిత్రం ఎదురే లేకుండా బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తుందనడంలో సందేహం లేదు.