డుంకి.. ఈ దమ్ము సరిపోద్దా

అయితే షారూఖ్ ఖాన్ డుంకి సినిమాలో పూర్తిగా పెద్దగా యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సలార్ లాంటి సినిమాతో పోటీ పడలేదు అని కూడా అభిప్రాయాలు వచ్చాయి.

Update: 2023-12-06 12:48 GMT

సలార్ సినిమాతో పాటు ఇప్పుడు డుంకి పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. షారుక్ నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అని కామెంట్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక విధంగా ఇరువర్గాల అభిమానుల మధ్య కూడా కామెంట్ల యుద్ధాలు గట్టిగానే జరుగుతున్నాయి. అయితే షారూఖ్ ఖాన్ డుంకి సినిమాలో పూర్తిగా పెద్దగా యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సలార్ లాంటి సినిమాతో పోటీ పడలేదు అని కూడా అభిప్రాయాలు వచ్చాయి.

అయితే నిన్న విడుదలైన ట్రైలర్ కూడా దాదాపు ఎమోషనల్ ఎలిమెంట్ తోనే ఎక్కువగా హైలెట్ అయింది. రాజ్ కుమార్ అంటేనే ఎమోషనల్ కంటెంట్ తో బాగా మెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా PK తరహాలో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక డుంకి సినిమా 24 గంటల్లో 58.5 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ ట్రైలర్లలో ఇది నెంబర్ వన్ రికార్డుగా నిలిచింది.

ఇక రెండవ స్థానంలో ప్రభాస్ ఆదిపురుష్ కు 52.2 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. తర్వాత రణబీర్ కపూర్ 'తూ ఝూతీ మైన్‌ మక్కర్‌' 50.9 మిలియన్ల వ్యూవ్స్ తో మూడు స్థానంలో ఉంది. యానిమల్ 50.6M, జవాన్ 45.6M, సర్కస్ 45 మిలియన్ల వ్యూవ్స్ తో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ టాప్ లిస్టు రికార్డును బ్రేక్ చేసిన డుంకి ట్రైలర్ మొత్తానికి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.

దీన్ని బట్టి సినిమాకు మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇక సలార్ డిసెంబర్ 21న రిలీజ్ అవుతుండగా అదే సమయంలో ఒక రోజు ముందు డుంకి రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఎంత వచ్చినా కూడా సలార్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. మొదటి రోజు ఎలాగూ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ క్రేజ్ వల్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తాయి.

ఇక టాక్ బాగుంటే మాత్రం ఆ తరువాత రోజు నుంచి బాక్సాఫీస్ రికార్డులు ఒక్కొక్కటిగా బ్లాస్ట్ అవ్వడం పక్క. కాబట్టి డుంకి ట్రైలర్ కు వచ్చిన వ్యూవ్స్ ను బట్టి చూస్తే ఓపెనింగ్స్ గట్టిగానే ఉంటాయి. ట్రైలర్ ద్వారా సలార్ కు పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఇక కంటెంట్ ఏ మాత్రం క్లిక్కయినా కూడా సలార్ కు పోటీ తప్పదు. ఇక సలార్ టాక్ తేడా కొడితే డుంకి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ పోటీలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News