పిక్ టాక్ : తెలుగమ్మాయి చిల్లింగ్ ఫోజ్
విభిన్నమైన హెయిర్ స్టైల్ లో ఈషా రెబ్బ చాలా క్యూట్ గా చూస్తూ ఆకట్టుకుంది. చూపు తిప్పనివ్వడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి.
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు రాణించలేని పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఈషా రెబ్బ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మెల్ల మెల్లగా మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ మెల్ల మెల్లగా చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలకు జోడీగా నటిస్తూ వస్తుంది.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సినిమాతో 2012 లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో మెయిన్ లీడ్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దకాలం అయినా కూడా ఈ అమ్మడికి దక్కాల్సిన ఆఫర్లు దక్కలేదని చెప్పాలి.
హీరోయిన్ గా సినిమాల్లో తక్కువ కనిపించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాలీవుడ్ ముద్దుగుమ్మలకు పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ చిల్లింగ్ మూమెంట్ ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సాధారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే నెట్టింట ఆధరణ కనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు నిండైన ఔట్ ఫిట్ ఫోటోలకి కూడా మంచి రీచ్ ఉంటుంది. విభిన్నమైన హెయిర్ స్టైల్ లో ఈషా రెబ్బ చాలా క్యూట్ గా చూస్తూ ఆకట్టుకుంది. చూపు తిప్పనివ్వడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు ఒక యంగ్ హీరోకు జోడీగా నటిస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు వస్తున్నా కూడా ఈ అమ్మడు పట్టించుకోవడం లేదని సమాచారం అందుతోంది.