ఆయనలేకపోతే సినిమా లేదు.. రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ పక్కా..!
నితిన్, శ్రీ లీల జోడీగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది
నితిన్, శ్రీ లీల జోడీగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత క్రేజ్ వచ్చేలా చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం థాంక్స్ చెప్పుకునే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. హీరో, నిర్మాత, టెక్నిషియన్స్ అందరు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు సపోర్ట్ చేశారని అన్నారు డైరెక్టర్ వక్కంతం వంశీ.
సినిమాలో చిన్న పాత్ర నుంచి మెయిన్ లీడ్ వరకు తమ ఫుల్ సపోర్ట్ అందించారు. విలన్ రోల్ కూడా అలరిస్తుంది. ఆయన నటనకు ఫ్యాన్ అయిపోయానని అన్నారు వక్కంతం వంశీ. రాజశేఖర్ గారు లేకపోతే ఈ సినిమాను ఊహించుకోలేం. ఈ క్యారెక్టర్ ఆయనకు పర్ఫెక్ట్ గా సూటైంది. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేనివి కూడా జరుగుతాయని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. నా విషయంలో రాజశేఖర్ గారు ఉండాలని బలంగా కోరుకున్నా అలానే జరిగిందని అన్నారు వక్కంతం వంశీ. ఈ సినిమా ఆయనకు ఎంత హెల్ప్ అవుతుందో పక్కన పెడితే సినిమాలో రాజశేఖర్ గారు మిమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తారని అన్నారు వక్కంతం వంశీ. ఆయన చేయడం వల్ల డబుల్ మైల్స్ సినిమా రీచ్ అయ్యింది.
సినిమాలో తన పాత్ర కన్నా మిగతా పాత్రల మీద ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు నితిన్. ఈ విషయంలో ఆయన చాలా మంచి సపోర్ట్ గా నిలిచారని అన్నారు. ఫ్యామిలీని సంతోష పెట్టే అవకాశాన్ని వదులుకోలేం. అలాంటి ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంచేలా రెండున్నర గంటలు ఈ సినిమాకు తీసుకురండని అంటున్నారు డైరెక్టర్ వక్కంతం వంశీ. సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఆయన అలా అంటారో అర్థం చేసుకోవచ్చు.
రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా నా పేరు సూర్య అంచనాలను అందుకోలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తర్వాత నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేశాడు వక్కంతం వంశీ.