ఫేక్ కాస్టింగ్ కాల్స్‌ని గుర్తించడమెలా?
ఈరోజుల్లో కృష్ణానగర్, ఫిలింనగర్ లో గల్లీ గల్లీకి, సందు సందుకి ఏదో ఒక సినిమా ఆఫీస్ తెరిచేస్తున్నారు
ఈరోజుల్లో కృష్ణానగర్, ఫిలింనగర్ లో గల్లీ గల్లీకి, సందు సందుకి ఏదో ఒక సినిమా ఆఫీస్ తెరిచేస్తున్నారు. ఆఫీస్ బయట కటౌట్ దర్శనమిస్తుంది. వీళ్లేదో పెద్ద సినిమా తీసేస్తున్నారు అనుకునేరు! అక్కడే ఉంది తప్పుడు ఆలోచన. నిజంగానే అది సినిమా తీసే ఆఫీసేనా? అసలు వాళ్లు కాస్టింగ్ కాల్ కి పిలుపునిచ్చారా లేదా? ఎలా తెలుస్తుంది? ఫోటోలు పట్టుకుని ఆఫీస్ టు ఆఫీస్ తిరిగే ఆర్టిస్టులకు కొత్తవాళ్లకు ఇందులో నిజమెంతో తెలిసేదెలా? ముఖ్యంగా స్టార్లుగా ఎదగాలని కలలుగనే కొత్త కుర్రాళ్లు, నటీమణులు, టాప్ మోడల్స్ కాస్టింగ్ ఏజెంట్ల అరాచకాల భారిన పడకుండా జాగ్రత్త పడటమెలా? అంటే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ వరకూ అయితే మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో మెంబర్ షిప్ సంపాదించాలి. అయితే కొత్త వారికి ఇందులో సభ్యత్వం లభించదు. దీనికి ప్రత్యామ్నాయంగా టీఎంటిఏయు అనే మరో సంఘం ఆర్టిస్టుల కోసం ఉంది. ఇందులో మెంబర్ షిప్ కోసం లక్షల్లో చెల్లించాల్సిన పని లేదు. వేలల్లోనే ఉంటుంది. కాబట్టి ఇందులో కొత్త వారు చేరేందుకు అవకాశం అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కనీసం క్యారెక్టర్లు చేసి ఉండాలి. ఆర్టిస్టు డైలాగ్ చెప్పి ఉండాలనే నియమం ఉంది. ఇంకా సంఘానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకుని అక్కడ సభ్యత్వం తీసుకుంటే దాని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. టిఎంటిఎయు గ్రూప్ లో సభ్యులుగా చేరినవారికి నిరంతరం వాట్సాప్ గ్రూపుల్లోనే చాలా వరకూ కాస్టింగ్ కాల్స్ గురించిన వివరాలు వెల్లడవుతుంటాయి. గ్రూప్ సభ్యులు నటీనటుల ఎంపికలు ఎక్కడ జరుగుతున్నాయో అడ్రెస్ లొకేషన్ వగైరా వివరాలను కూడా షేర్ చేస్తుండడంతో అది అందరికీ సహకరిస్తుంది. ముఖ్యంగా కొత్తవాళ్లు ఆఫీసులు వెతుక్కోవాల్సిన పని లేదు.
దీనికి తోడు చాలామంది కాస్టింగ్ ఏజెంట్లు కాస్టింగ్ కాల్స్ కి పిలుపునిస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తున్నారు. వీళ్లలో చాలామంది ఫేక్ ఏజెంట్లు కూడా ఉన్నారు. వీళ్ల ఉద్ధేశం ఏదైనా కానీ, తమకు సినిమాలో అవకాశం వస్తుందో లేదో తెలియని గందరగోళంలో ఉన్న కొత్త ఆర్టిస్టులు మరింత గందరగోళానికి లోనవుతున్నారు. వీళ్ల ఆసక్తిని కొందరు ఫేక్ ఏజెంట్లు ఎన్ క్యాష్ చేసుకునేందుకు డబ్బు చెల్లింపులు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంటారు. అసలు టాలీవుడ్ లో అనధికారికంగా ఇలా డబ్బు వసూలు చేసే ఫేక్ గాళ్లను అస్సలు నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు.. ఏది ఫేక్? ఏది నిజం తెలుసుకోవడానికి కొన్ని నియమాలను సూచిస్తున్నారు. దయచేసి నటీనటులు చేయవలసినవి & చేయకూడనివి ఏమిటో తెలుసుకుని ఇవి పాటించండి.
1.కాస్టింగ్ కాల్‌ని జాగ్రత్తగా & స్పష్టంగా చదవండి:-
పాత్ర -
లింగం M/F -
వయస్సు -
ఎత్తు -
రంగు -
ఫ్రెషర్ లేదా అనుభవం-
స్థానం.
2. కాస్టింగ్ కాల్ పోస్ట్ ఎవరి ద్వారా పోస్ట్ అయిందో తనిఖీ చేసుకోండి.
దర్శకుడు
అసోసియేట్ డైరెక్టర్
కాస్టింగ్ డైరెక్టర్
ప్రొడక్షన్ మేనేజర్
3. మస్ట్ గా ఫోటోలు, వీడియోలు పంపవలసిన నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని చాలా స్పష్టంగా తనిఖీ చేయండి
4. కాస్టింగ్ కాల్‌లో వారు ఎన్ని ఫోటోలు లేదా వీడియోలను అడుగుతున్నారో దయచేసి గమనించండి
5. కాస్టింగ్ కాల్ పోస్ట్ చేసినప్పుడు దయచేసి లింగం, వయస్సు సహా అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి. మీ ప్రొఫైల్ ఆ కాస్టింగ్ కాల్‌కి సరిపోతుంటే లేదా సరిపోలితే మాత్రమే మీరు వాటిని పంపవలసి ఉంటుంది.
6. మీ ప్రొఫైల్ కాస్టింగ్ కాల్‌కు సరిపోకపోతే.. వారికి మీ ప్రొఫైల్ లేదా ఫోటోలను పంపవద్దు
వారికి అనవసరంగా బల్క్ ఫోటోలు లేదా బల్క్ వీడియోలు పంపవద్దు. మీరు వారి పనికి ఆటంకం కల్పించిన వారవుతారు. ఎందుకంటే వారు కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనిలో ఉంటారు
7.మీ ప్రొఫైల్ కాస్టింగ్ కాల్‌కు అనుగుణంగా ఉంటే, కాస్టింగ్ కాల్ ప్రకారం వారు అడిగిన వాటిని పంపండి.
8.క్రింద పేర్కొన్న వాటిని పంపవద్దు & వారి పనికి అంతరాయం కలిగించవద్దు లేదా ఇబ్బంది పెట్టవద్దు.
హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఓక్క ఛాన్స్ ప్లీజ్ సార్ /మేడమ్. ఇలా చేయవద్దు.
మీ నంబర్ బ్లాక్ చేస్తారు కాబట్టి మీరు తదుపరి సరైన కాస్టింగ్ కాల్ కోసం మీ ప్రొఫైల్ ని పంపలేరు.
9. మీ వివరాల ప్రొఫైల్, ఫోటోలు, వీడియోలను వారికి షేర్ చేసిన తర్వాత కొంత సమయం ఓపిక పట్టండి & వారు మీకు తిరిగి ప్రతిస్పందించే వరకు వేచి ఉండండి లేదా ప్రశాంతంగా ఉండండి.
వారికి కాల్ చేసి డిస్టర్బ్ చేయవద్దు. షార్ట్‌లిస్ట్ చేస్తే లేదా ఎంపిక అయితే, వారు మీకు తిరిగి కాల్ చేస్తారు అని గ్రహించండి. కాస్టింగ్ ఏజెంట్ మీతో మాట్లాడే విధానాన్ని బట్టి వారి ఉద్దేశం ఏమిటో కనిపెట్టేయొచ్చు. కొంత లాజికల్ గా ఆలోచిస్తే ఫేక్ ఎవరో తేలిపోతుంది. కేటుగాళ్ల విషయంలో మహిళా ఆర్టిస్టులు తస్మాత్ జాగ్రత్త!!
ప్రొఫైల్ ఫార్వార్డ్ చేయాల్సిన విధానం:
*హాయ్.. నమస్తే సార్ / గుడ్ మార్నింగ్
(కాస్టింగ్ కాల్ పోస్ట్ చేసిన వారి పేరు),
నేను మీరు పోస్ట్ చేసిన కాస్టింగ్ కాల్ చూసాను. ఆ ప్రాజెక్టులో (ప్రాజెక్ట్ పేరు)
(పాత్ర పేరు) ఆ పాత్ర కోసం నన్ను పరిశీలించగలరు..
నా నటనానుభవం
*గతంలో మీకు కలిగిన కొన్ని నటనానుభవాలను హైలైట్ చేయండి. ఈ కారణంగా ఈ పాత్రకు నేను సరిపోతానని నేను గట్టిగా నమ్ముతున్నాను.. అని తెలియజేయండి..
ధన్యవాదాలు..
(మీ పేరు)
కాంటాక్ట్ నం.
మీ నుండి సమాచారం వినడానికి & మీ ఈ ప్రాజెక్ట్‌లో నేను భాగం కావాలని ఎదురుచూస్తున్నాను.
(ఇది ముగింపు)