వెబ్ సిరీస్ ని ఫాలో అయి పొలీసులకు దొరికిన దొంగ!
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కి చెందిన లక్ష్మి నారాయణ అనే వ్యక్తి ఫేక్ నోట్లు చేసి దొరికిపోయాడుట. 'ఫర్జీ' సిరీస్ లానే తన అసిస్టెంట్ ని పెట్టి మొదట టెస్టింగ్ కి పంపగా అక్కడే పోలీసులకి దొరికిపోయాడట.
నిజాయితీగా కష్టపడితే అప్పుల నుంచి బయటపడటం అసాధ్యమని భావించిన సన్నీ డియోల్ తన స్నేహితుడు ఫిరోజ్‌తో కలిసి దొంగనోట్లను ముద్రించడం మొదలుపెడతాడు. ఒరిజినల్ నోట్‌ను పోలిన అతడు ముద్రించిన నోట్‌ను దొంగనోట్ల మిషన్ కూడా కనిపెట్టదు. అంత పక్కాగా ప్లాన్ చేసి అచ్చు వేస్తాడు. మరోవైపు దొంగ నోట్ల వ్యాపారాన్ని చేస్తోన్న బడా క్రిమినల్ మన్సూర్‌ను టార్గెట్ చేస్తాడు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్ మైఖేల్. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
సన్నీ ప్రతిభను గురించి తెలుసుకున్న మన్సూర్ తన టీమ్‌లో చేర్చుకుంటాడు. ఇద్దరు కలిసి పన్నెండు వేల కోట్ల రూపాయల దొంగ నోట్లను ఇండియాకు తీసుకు రావడానికి సిద్ధమవుతారు. ఆ నోట్లను ఇండియాకు తరలించే క్రమంలో సన్నీ పోలీసుల నుంచి తప్పించుకోలిగాడా? లేదా అన్నది 'ఫర్జీ కథ. సరిగ్గా ఇదే కథని తలపిస్తుంది ఓ రియల్ స్టోరీ. మరి అతడికి ఈ సినిమా స్పూర్తా? కాదా అన్నది తెలియదు గానీ ఒకరు ఇదే తరహాలో మోసం చేయాలని పోలీసుకుల అడ్డంగా దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కి చెందిన లక్ష్మి నారాయణ అనే వ్యక్తి ఫేక్ నోట్లు చేసి దొరికిపోయాడుట. 'ఫర్జీ' సిరీస్ లానే తన అసిస్టెంట్ ని పెట్టి మొదట టెస్టింగ్ కి పంపగా అక్కడే పోలీసులకి దొరికిపోయాడట. దీనితో వారి నుంచి పోలీసులు చాలానే ఫేక్ నోట్లని గుర్తించి అసలు వ్యక్తుల్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో లక్షి నారాయణ అసలు చాలాదే బయటకు వస్తోంది. అతడి నకిలీ గోల్డ్ కేసులు కూడా ఉన్నాయని వెలుగులోకి వస్తోంది.
ఏది ఏమైనా 'ఫర్జీ' సిరీస్ ని కాపీ కొట్టి పోలీసులకు అడ్డంగా దొరకడం..కటకటాల పాలు కావడం ఆశ్చర్యప రుస్తుంది. 'పుష్ప' తర్వాత అదే స్టైల్లో స్మగ్లింగ్ కి పాల్పడి కూడా ఒకరు దొరికినట్లు వార్తలొచ్చాయి. ఇంకా లోతులోకి వెళ్తే సినిమా స్పూర్తితో దొంగతనాలకు పాల్పడిన చిట్టా చాలా పెద్దదే వస్తుందండోయ్.