ఫేమ‌స్ ఫిలిం క్రిటిక్ మృతి!

నిత్యం స‌మాజంలో రోజూ జ‌రిగే వివిధ అంశాల‌పై త‌న‌దైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతో ఫేమ‌స్ అయ్యారు.

Update: 2024-04-17 10:49 GMT

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ఇన్ ప్లూయ‌న్స‌ర్-యూట్యూబ‌ర్ అబ్ర‌దీప్ సాహా అలియాస్ యాంగ్రీ రాంట్ మెన్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయన మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు అసాధార‌ణ‌మై ఫాలోయింగ్ ఉంది. నిత్యం స‌మాజంలో రోజూ జ‌రిగే వివిధ అంశాల‌పై త‌న‌దైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతో ఫేమ‌స్ అయ్యారు. దీంతో అతికొద్ది కాలంలో మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు.

క‌ర్ణాట‌క‌కు చెందిన అబ్ర‌దీప్ సాహ `రాంట్ మ్యాన్` అనే సోష‌ల్ మీడియాతో బాగా పేరు తెచ్చుకున్నాడు. తొలుత `కేజీఎఫ్` సినిమా రివ్యూతో వెలుగులోకి వ‌చ్చారు. రొటీన్ కి భిన్న‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ తో రివ్యూలు ఇవ్వ‌డం ఇత‌ని ప్ర‌త్యేక‌త‌. అవేశంతో, కోపంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఫన్నీగా రివ్యూలు ఇచ్చేవాడు. సినిమాల‌తో పాటు క్రికెట్..ఫుట్ బాల్..పాలిటిక్స్ ఇలా ప్ర‌తీ అంశాన్ని ట‌చ్ చేసారు. సూటిగా సుత్తి లేకుండా ముఖం మీద కొట్టిన‌ట్లే అత‌డి రివ్యూలు ఉండేవి. అందుకే అంత పాపుల‌ర్ అయ్యాడు.

తాజాగా అత‌ని మ‌ర‌ణంతో సోష‌ల్ మీడియా మూగ‌బోయింది. కుటుంబ స‌బ్యులు క‌న్నీమున్నీరుగా విల‌పిస్తున్నారు. అబ్ర‌దీప్ మృతి ప‌ట్ల అంతా సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. చాలా మంది సెల‌బ్రిటీలు కూడా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు. మ‌రోసారి నేష‌నల్ వైడ్ నెంబ‌ర్‌1 స్థానంలో యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరు ట్రెండింగ్ అవుతోంది. మృతికి గ‌ల కార‌ణాల్లోకి వెళ్తే.. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ కోసం బెంగుళూరులోని ఓ ఆసుప‌త్రిలో చేరిన అబ్ర‌దీప్ నెల రోజులుగా అక్క‌డే చికిత్స పొందుతున్నాడు.

ఈ క్ర‌మంలో కోలుకుంటున్నాడ‌ని కూడా వార్త‌లొచ్చాయి. కానీ మ‌ల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కార‌ణంగా మృత్యువుతో పోరాడి మ‌ర‌ణించిన‌ట్లు క‌న్న‌డ ప‌త్రిక‌ల్లో వార్త‌లొచ్చాయి. అయితే అబ్ర‌దీప్ కి ఆర్దిక స‌మ‌స్య‌లున్న‌ట్లు కూడా ఈ సంద‌ర్బంగా వెలుగులోకి వ‌స్తోంది.

Tags:    

Similar News