ఏడున్నర కేజీల గర్భం, ఒకరిని తొలగించాలి..!

ఫరాఖాన్‌ అప్పటి విషయాలను గురించి మాట్లాడుతూ... నేను శిరీష్ ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లం. ఇద్దరు పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండేవాళ్లం.

Update: 2024-03-27 14:30 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని లేడీ కమర్షియల్‌ డైరెక్టర్ ఫరాఖాన్. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుని అటు నుంచి దర్శకురాలిగా నిర్మాతగా కూడా బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును గౌరవంను దక్కించుకున్న ఫరాఖాన్‌ 2008 లో ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

2004 సంవత్సరంలో దర్శకుడు శిరీష్ కుందర్‌ ను వివాహం చేసుకుంది. నాలుగు సంవత్సరాల పాటు వీరు పిల్లల కోసం ప్రయత్నాలు చేశారు. సహజ పద్ధతిలో పిల్లలు సాధ్యం కాదని ఐవీఎఫ్ ద్వారా ఫరాఖాన్ మరియు శిరీష్ కుందర్ లు తల్లిదండ్రులు అవ్వాలి అనుకున్నారట.

ఫరాఖాన్‌ అప్పటి విషయాలను గురించి మాట్లాడుతూ... నేను శిరీష్ ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లం. ఇద్దరు పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండేవాళ్లం. ఆ సమయంలో డాక్టర్‌ మాకు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు కాబోతున్నట్లు చెప్పారు.

42 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లలతో ఉన్న గర్భం ను క్యారీ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. డెలివరీ సమయంలో రిస్క్ అవ్వచ్చు. అంతే కాకుండా పుట్టబోయే పిల్లల్లో ఒకరు అయినా చాలా బలహీనంగా అనారోగ్య సమస్యలతో పుట్టవచ్చు అని డాక్టర్ హెచ్చరించారు.

ఒక బేబీని తొలగించడం మంచిది అంటూ డాక్టర్‌ సూచించారు. కానీ నేను బేబీని తొలగించాలి అనుకోలేదు. కడుపులో ఉన్న ప్రతి బేబీ కూడా రెండున్నర కేజీలకు తగ్గకుండా పెరగాలని అనుకున్నాము. అందుకు తగ్గట్లుగా డైట్‌ ను ఫాలో అవుతూ మెడికల్‌ గా వెళ్లాం.

డెలివరీ సమయంలో ముగ్గురు బేబీలు కూడా రెండున్నర కేజీలకు ఎక్కువగానే ఉన్నారు. మొత్తంగా ఏడు కేజీల గర్భంతో నేను కొన్ని రోజుల పాటు కొనసాగాను అంటూ ఫరా ఖాన్‌ చెప్పుకొచ్చారు. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకుతో ఫరాఖాన్‌ దంపతులు చాలా సంతోషంగా జీవితం సాగిస్తున్నారు.

Tags:    

Similar News