వీడియో: నోరెళ్ల‌బెట్టేలా ఫాతిమా చేసిన ఈ పని!

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బ్లాక్ బ‌స్ట‌ర్ `దంగ‌ల్`లో అమీర్ ఖాన్ తో క‌లిసి కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Update: 2024-05-16 01:30 GMT

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బ్లాక్ బ‌స్ట‌ర్ `దంగ‌ల్`లో అమీర్ ఖాన్ తో క‌లిసి కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఆ త‌ర్వాత అమీర్‌తో డేటింగ్ చేస్తోంద‌న్న ప్ర‌చారం సాగింది. త‌న‌దైన అందం న‌ట‌నతో ఆక‌ట్టుకుంటూనే వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు జీవం పోయడంలో తన అసాధారణ సామర్థ్యంతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ఇన్ స్టాలోను స్పీడ్ చూపిస్తోంది.


ఫాతిమా జిమ్ - యోగా సెష‌న్స్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోల‌ను ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేస్తోంది. తాజాగా ఫాతిమా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఒక ఫ‌న్నీ వీడియో వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో త‌ల‌కిందులుగా శీర్షాస‌నం వేసేందుకు జిమ్ లో జంపింగ్ చేసిన‌ తీరు నోరెళ్ల‌బెట్టేలా చేసింది. దీనికి ఫాతిమ ఇచ్చిన క్యాప్ష‌న్ ఇలా ఉంది. ``ఇన్‌స్టా ఛాలెంజ్ పూర్తయింది. పి.ఎస్. కిసీ కో ఇస్స్ ఛాలెంజ్ కా నామ్ సాంగ్ హై? .. నాకు మద్దతుగా నిలిచినందుకు క‌ర‌ణ్ కి ధన్యవాదాలు`` అని క్యాప్ష‌న్ లో రాసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇంత‌కుముందు ఫాతిమా మ‌రో ఫ‌న్నీ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా దూసుకెళ్లింది. అక్షయ్ కుమార్- కాదర్ ఖాన్ నటించిన ఓ చిత్రం నుండి ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఈ ఫోటోకి ఒక ఫ‌న్నీ క్యాప్షన్ ఇచ్చింది. ``దుగ్గల్ సాహబ్ ఆజ్ క్యా బనే హైన్ ఊహించాలా? స్లయిడ్ 3 నిజమైన సమాధానం ఉంది!`` అని రాసింది. దీనిపై ప‌లువురు స‌హ‌న‌టీమ‌ణులు అంతే ఫ‌న్నీగా స్పందించారు. దియా మీర్జా,రియా చక్రవర్తి స‌హా ప‌లువురు ఈ పోస్ట్ పై వ్యాఖ్యానించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఫాతిమా చివరిసారిగా విక్కీ కౌశల్ - సన్యా మల్హోత్రాలతో కలిసి సామ్ బహదూర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. తర్వాత నసీరుద్దీన్ షా- విజయ్ వర్మలతో ఉల్ జలూల్ ఇష్క్‌లో కనిపించనుంది. ఇటీవ‌ల ఫాతిమా ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తోంది.


Tags:    

Similar News