ప్రభాస్ ఈ డైరెక్టర్ ప్లాన్ పర్ఫెక్ట్!
హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా ది రాజా సాబ్ రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ లైన్ అప్ లో మరో నాలుగు సినిమాలు వరకు ఉన్నాయి. వీటిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, కల్కి పార్ట్ 2 ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయాయి.
హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మించనుంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని తెలుస్తోంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించనున్నారు. ఫౌజీ అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభోత్సవం ఆగస్టులో జరగబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమా పూజ, ప్రారంభోత్సవం ఆగస్టు 17న చేయబోతున్నారంట. ఆగస్టు 24న మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 1945 బ్యాక్ డ్రాప్ ని ఎలివేట్ చేసే విధంగా సెట్స్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ వరకు కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. పెద్దగా బ్రేక్ లేకుండా సినిమా వర్క్ ప్లాన్ ప్రకారంకొనసాగనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మూవీ ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమాలో క్యాస్టింగ్ పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. వరల్డ్ వార్ నేపథ్యంలో ప్రేమ కథని ఈ చిత్రంలో హను రాఘవపూడి చెప్పబోతున్నారంట. ఇప్పటికే సీతారామం సినిమాతో అద్భుతమైన ప్రేమకథని హను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
హను రాఘవపూడి ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 2026 ప్రారంభంలో ఫౌజీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా చేస్తూనే ఫౌజీ మూవీని కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని హను రాఘవపూడి ఒక పార్ట్ గానే చేస్తారా లేదంటే రెండు భాగాలుగా తెరకెక్కిస్తారా అనేది లాంచింగ్ రోజు తెలిసే ఛాన్స్ ఉంది.