దేవర.. ఈ సెంటిమెంట్ కలిసొచ్చేనా?
అలాగే ఈ ఏడాది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ఈ మూవీ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా మాసివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా ఏకంగా 170 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే అందుకుందని మేకర్స్ ఒక పోస్టర్ అయితే విడుదల చేశారు. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సోలోగా ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇవి హైయెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఏడాది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ఈ మూవీ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
మొదటి రోజు మెజారిటీ ఫ్యాన్స్ ఈ సినిమాని చూశారు. వారి నుంచి అయితే సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ ఆధ్యంతం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మాస్ యాక్షన్ కథలు ఇష్టపడేవారికి మాత్రం ‘దేవర’ నచ్చుతుందని అంటున్నారు. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఎలా అయితే తెరపై చూడాలని అనుకున్నారో కొరటాల ఆ విధంగా ప్రెజెంట్ చేసాడనే మాట వినిపిస్తోంది.
కథ పరంగా కొంత మైనస్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ‘దేవర’ సినిమాకి ఓ సెంటిమెంట్ ప్రధాన బలంగా మారబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో హీరోగా చేసిన రెండో సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ 2001 సెప్టెంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ఆరంభంలో మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. వారాంతం తర్వాత సినిమాకి ఆదరణ పెరిగింది. లాంగ్ రన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం నిలిచింది.
ఇప్పుడు ‘దేవర’ సినిమాకి కూడా మొదటి రోజు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మేకర్స్ కూడా మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉన్నారు. సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ క్రేజ్ నేపథ్యంలో ఈ రెండు రోజులు ‘దేవర’ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. వారాంతం తర్వాత సినిమా ఏ మేరకు ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే దానిపై లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.
అక్టోబర్ 2 లేదా 3వ తేదీ నుంచి దసరా హాలిడేస్ మొదలు కాబోతున్నాయి. ఈ హాలిడేస్ ‘దేవర’ కి ప్లస్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే సినిమాకి వచ్చిన నెగిటివిటీని వీలైనంత వరకు తగ్గించి పాజిటివ్ వైబ్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం మేకర్స్ చేయాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది.