పెద్ద తెరతో పాటు బుల్లి తెరా వీళ్ల సొంతం!
ఛాన్సు వస్తే సినిమా చేయడం లేదంటే వెబ్ సిరీస్ లోకి దూరిపోవడం కొంత మంది దర్శకులు పనిది
ఛాన్సు వస్తే సినిమా చేయడం లేదంటే వెబ్ సిరీస్ లోకి దూరిపోవడం కొంత మంది దర్శకులు పనిది. మరి రెండు రకాలుగా రాణిస్తున్న దర్శకులు ఎవరైనా ఉన్నారా? అంటే టాలీవుడ్ నుంచి ముందు వరుసలా వీళ్లంతా కనిపిస్తున్నారు. విక్రమ్. కె. కుమార్...క్రిష్.. హరీష్ శంకర్..మహి. వి. రాఘవ..సందప్ నంది..తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు సినిమాలతో పాటు ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.
కోలీవు డ్..టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరున్న విక్రమ్. కె. కుమార్ ఇటీవలే దూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టారు. నాగచైతన్య మెయిన్ లీడ్ పోషించిన ఆ సిరీస్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కి రెడీ అవుతున్నారు. అలాగే కొత్త కథలతో మరిన్ని సిరీస్ లు రూపొదించడానికి ఆయన సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక హరీష్ శంకర్ డైరెక్టర్ కాక ముందు రైటింగ్ విభాగం లో.. అసిస్టింటె డైరెక్టర్ గా పనిచేసాడు.
'ఏటీఎమ్' అనే వెబ్ సిరీస్ వెనుక హరీష్ శంకర్ హస్తం ఉంది. ఇక యాత్ర తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మహి. వి.రాఘవ కూడా వెబ్ సిరీస్ లుచేసాడు. 'సేవ్ ది టైగర్స్'..'షైతాన్' లాంటి వెబ్ సిరీస్ లు ఆయన నుంచి వచ్చినవే. అలాగే మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న సంపత్ నంది సినిమాలు లేని సమయంలో వెబ్ సిరీస్ లకు పనిచేసాడు. ఆ సిరీస్ ల సక్సెస్ తో మళ్లీ దర్శకుడిగా బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయితేజ్ తో 'గాంజా శంకర్' తెరకెక్కిస్తున్నాడు.
అలాగే యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ వె బ్ సిరీస్ లకు పనిచేస్తున్నాడు. ఇలా వీళ్లంతా ఎక్కువ గ్యాప్ దొరికిన సమయంలో వెబ్ సిరీస్ లకు పనిచేస్తున్నారు. మంచి హీరో...ప్రొడక్షన్ హౌస్ దొరికితే తమ కథల్ని వెండి తెరకి ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరోలంతా ఇప్పుడు బిజీగా ఉండటంతో హిట్ అయిన దర్శకుడు కూడా వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దర్శకులు వెబ్ సిరీస్ లవైపు మళ్లుతున్నారు.