టాలీవుడ్ లోనూ అక్షయ్ కుమార్ లాంటి ప్లాప్ హీరో!
చేతులు కాల్చుకున్నారు. అలాంటి హీరో కూడా టాలీవుడ్ లో ఒకరున్నారు. కొంత కాలంగా అతడి కెరీర్ ని పరిశీలిస్తే బాలీవుడ్ అక్షయ్ కుమార్ నే తలపిస్తుంది.
బాలీవుడ్ లో కిలాడీ అక్షయ్ కుమార్ ఎలా వరుసగా పరాజయాలు అందుకుంటున్నాడో తెలిసిందే. అయినా సరే అక్షయ్ కి అవకాశాల వెల్లువ మాత్రం ఆగలదేదు. పరాజయాలతో పనిలేకుండా దర్శక, నిర్మాతలు అతడితో సినిమాలు చేస్తున్నారు. అతని గత ప్లాప్ లతో పనే ముంది. మన కథ మంచిగుంటే హిట్ అవుతుంది కదా? అన్న ధీమాతోనే ఇప్పటి వరకూ చాలా మంది సినిమాలు చేసారు.
చేతులు కాల్చుకున్నారు. అలాంటి హీరో కూడా టాలీవుడ్ లో ఒకరున్నారు. కొంత కాలంగా అతడి కెరీర్ ని పరిశీలిస్తే బాలీవుడ్ అక్షయ్ కుమార్ నే తలపిస్తుంది. ఆ స్టార్ హీరో హిట్ అందుకుని చాలా కాలమ వుతోంది. ఆర్డర్ ప్రకారం కింద నుంచి లెక్కిస్తే పది సినిమాల వరకూ చూస్తే అందులో హిట్ సినిమాలు రెండు మాత్రమే కనిపిస్తాయి. మిగతా సినిమాలేవి కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తెచ్చి ఉండవు.
అంత దారుణమైన ప్లాప్ చిత్రాలుగా కనిపిస్తాయి. ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ చిత్రం కూడా పరాజయం చెందింది. ఆ సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశించారు. కానీ మళ్లీ నిరాశ తప్పలేదు. అయినా సరే హీరో మాత్రం ఇప్పటికీ బిజీగానే ఉన్నాడు. కొత్త సినిమాలు అలా కమిట్ అవుతూనే ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం పంపిణీదారుల నుంచి పవనాలు కాస్త వ్యతిరేకంగా వీస్తున్నాయి.
నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాలు నమ్మకంతో కొనేది లేదని చెబుతున్నారుట. పాత సినిమా ప్లాప్ ల బకాయిలు చెల్లిస్తే తప్ప సినిమా రిలీజ్ కి వెళ్లనీయమని చిన్న పాటి హెచ్చరిక జారీ చేసారుట. ఇప్పటి వరకూ నష్టాలేమైనా ఉంటే తదుపరి సినిమాలో బ్యాలెన్స్ చేసుకుందాం? అనే మాటతో ధైర్యంగా రిలీజ్ చేసినా ఇప్పుడా ధైర్యం పంపిణీ వర్గాల్లో పూర్తిగా సన్నగిల్లిందని గుస గుస వినిపిస్తుంది. తదుపరి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే? కొన్ని కండీషన్ల ప్రకారమే ముందుకు వెళ్తామనే ఓ ప్రపోజల్ సైతం తీసుకొచ్చారుట. మరి ఆ సంగతేంటి? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.